Rice Cultivation Methods: సంమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు ఏ కాలంలోనైనా సాగుకు మొగ్గు చూపే ఆహార పంట వరి, అందుకే దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా మన కోస్తా ప్రాంతం ప్రసిద్ధికెక్కింది . ముఖ్యంగా ఉత్తరకొస్తా,ఉభయ గోదావరి జిల్లాలలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ ఇరూ తెలుగు రాష్ట్రాలలో కోటి ఎకరాలకు పైగా మాగాణి భూములు ఉన్నాయి. నల్ల భూములు, ఎర్ర నేలలు, తేలిక నేలలు ఇలా అన్ని రకాల నేలల్లో వరిని సాగు చేస్తున్నారు. ధాన్యపు పంటలలో అతి ముఖ్యమైన ఆహార పంట వరి. మన ప్రధాన ఆహార పంట అయిన వరి సాగులో పలు రకాల విత్తే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు ప్రాంతాన్ని బట్టి, నీటి వసతి ని బట్టి అనుకూల విధానాలు ఆచరిస్తున్నారు.
వరి సాగు లో వివిధ రకాల విత్తే పద్ధతులు:
1) సాంప్రదాయక పద్దతి లో వరి నాట్లు
2) వెద వరి
a) పొడి దుక్కి చేసిన పొలంలో నేరుగా వరిని విత్తే పద్ధతి (Dry direct seeding)
b) దమ్ము చేసిన పొలంలో నేరుగా వరిని విత్తే పద్ధతి(wet direct seeding)
3) శ్రీ వరి సాగు పద్దతి
4) ఆరుతడి వరి ( ఏరోబిక్ రైస్)
5) యంత్రాలతో వరి నాట్లు
సాంప్రదాయక పద్దతి లో వరి నాట్లు :
•నాట్లు వేయటానికి పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలి?
రైతులు నాట్లు వేయటానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురుగు దమ్ము చేయాలి.పొలం అంతా సమానంగా దమ్ము చెక్కతో గాని, అడ్డ తో గాని చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయటానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది.
• నాట్లు వేయడం ఎలా?
నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా
వుంటేనే మూన త్వరగా తిరుగుతుంది. అలాగె
4-6 ఆకులున్న నారును ఉపయోగించాలి.
ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది.
నాట్లు పై పైన వేస్తే పిలకలు ఎక్కువగానే వచ్చే అవకాశం కలదు కాబట్టి రైతులు నాట్లు వేసే కూలీలకు మరీ లోతుగా నాట్లు గుచ్చకుండ పైపైన
గుచ్చమని చెప్పాలి. నాట్లు వేసేటప్పుడు రైతులు భూసారాన్ని అనుసరించి కుదుళ్ళ సంఖ్యను నిర్ణయించుకోవాలి. ఖరీఫ్ లో చ|| మీ 33 మూనలు, రబీలో చ|| మీ 44 మూనలు, ఎడగారు లో చ|| మీ 66 మూనలు ఉండేలా చూసుకోవాలి. బాగా మెత్తగా/ బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-10 రోజుల లోపు నాట్లు వేయడం ముగించాలి. అలాగె రైతులు నాటిన తర్వాత ప్రతి 2 m లకు 20 cm కాలిబాటలు తీయటం వలన పైరుకు గాలి,వెలుతురు బాగా సోకి చీడపీడల ఉదృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. అలాగె రైతులు ఎరువులు వేసుకోవటానికి ,పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ చేసుకోవటానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి.
వెద వరి : వ్యవసాయం లో రోజు రోజుకి సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. పెట్టుబడి ని తగ్గించుకుంటు లాభసాటి దిగుబడులు పొందే విధానాలపై రైతులు అడుగులు పడుతున్నాయి. ప్రధాన ఆహార పంట అయిన వరిలో కూలీల అవసరం ఎక్కువ ,కూలీల కొరత కారణంగా వరి సాగులో నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి వెద పద్ధతి . వెద పద్ధతిలో ఖర్చులు తగ్గటంతో పాటు సమయం కూడ ఆదా అవుతుంది.
Also Read: Selection and Sowing of Seeds: విత్తన ఎంపిక మరియు కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
a) పొడి దుక్కి చేసిన పొలంలో నేరుగా వరిని విత్తే పద్ధతి (Dry direct seeding)
భూమిని 2-3 సార్లు బాగా దుక్కి చేసుకొని,చదును చేసి June 20 తర్వాత దీర్ఘకాలిక రకాలు ఎంపిక చేసుకొని సాగు చేసుకోవటం అనుకూలం. అదే july మొదటి వారం తర్వాత అయితే మద్యకాలిక రకాలు ఎంపిక చేసుకొని సాగు చేసుకోవటం అనుకూలం. బలమైన వేరు వ్యవస్థ, కాండం దృఢంగా ఉండి, పిలక బాగా చేస్తూ కలుపును అనిచివేసే రకాలు ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా 3 సార్లు బాగా దున్ని చదును చేసుకున్న తర్వాత విత్తనాన్ని ఎకరాకు సన్న రకం అయితే 15-16 kgs/ఎకరానికి, మధ్యస్థ సన్న, లావు రకాలు అయితే 18-20 kgs/ఎకరానికి అవసరం అవుతాయి. సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ఉపయోగించి కూడ విత్తుకోవచ్చు.
b) దమ్ము చేసిన పొలంలో నేరుగా వరిని విత్తే పద్ధతి(wet direct seeding):
ఈ పద్ధతిలో పొలాన్ని దమ్ము చేసుకొని,చదును చేసుకొని పొడి విత్తనం గాని, మొలకెత్తిన విత్తనం గాని వెదజల్లుతారు . విత్తనాలు 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలు గోనేసంచిలో వేసి గాని లేదా గోనేసంచి కప్పి గాని 24 గంటలు పాటు ఉంచాలి. A ఆ తర్వాత విత్తనాన్ని వేదజల్లుకోవచ్చు లేదా డ్రమ్ సీడర్ తో విత్తుకోవచ్చు. సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిలో కూడ తయారు చేయాలి. కాకపోతే పొలంలో నీరు నిల్వ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే పోవటానికి ఏర్పాట్లు చేయాలి.
బంక నేలల్లో చివరి దమ్ము చేసి,చదును చేసిన మరుసటి రోజు విత్తుకోవచ్చు. విత్తే సమయానికి నీరు లేకుండా బురద గా ఉంటే చాలు.
ఇసుక శాతం అధికంగా ఉండే నేలల్లో విత్తాలి అనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి,చదును చేసి పలుచటి నీటి పొర ఉండేటట్లు చసుకోవాలి.మండేకట్టి మొలక వచ్చిన విత్తనాలను వెదజల్లి గాని,డ్రమ్ సీడర్ తో గాని విత్తుకోవచ్చు. ఏదేమైప్పటికీ వెదజల్లే సాగు విధానంలో సరైన సమయంలో కలుపు యాజమాన్య చేయక పోతే దిగుబడులు దాదాపుగా 50-80 % తగ్గే అవకాశం కలదు.
శ్రీ వరి సాగు పద్దతి:
నారు వయస్సు: వరి పద్దతి లో 8-12 రోజుల వయస్సు గల రెండు ఆకుల నారును మాత్రమే నాటాలి.
విత్తన మోతాదు: 2 కిలోల విత్తనాన్ని ఒక సెంటు భూమిలో చల్లి నారు పెంచితే ఎకరాకు సరిపోతుంది.
ప్రధాన పొలం తయారి: సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే శ్రీ పద్దతి లో కూడా తయారు చేయాలి. అయితే ఈ పద్ధతిలో పొలం తడిగా ఉండాలి కాని నీరు నిల్వ ఉండకూడదు, కాబట్టి నీరు ఎక్కువైన వెంటనే బయటకి పోయేలా ఏర్పాటు చేయాలి మరియు పొలాన్ని బాగా చదును చేయాలి.
ప్రధాన పొలం లో విత్తే విధానం: దమ్ము చేసి,చదును చేసిన పొలం లో చేతితో లాగే రోలర్ మార్కర్ తో 25×25 cm దూరంలో నిలువుగా మరియు అడ్డంగా గీతలు గీయాలి. నాలుగు గీతలు కలిసిన చోట వరి నారు మొక్కలను పై పైన గుచ్చాలి.
ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువ.
ఆరుతడి వరి ( ఏరోబిక్ రైస్):
భూమి తయారి: భూమిని 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసుకొని చదును చేసుకోవాలి.
విత్తన మోతాదు: 16 kgs/ఎకరానికి
విత్తనశుద్ధి: కార్బెoన్డజిమ్ 3 gm / 1 kg విత్తనానికి
విత్తే విధానం : శుద్ధి చేసిన విత్తానాన్ని నేరుగా చదును చేసిన పొలం లో వెదజల్లడం ద్వారా గాని 20 cm దూరం లో నాగటి సాలు వెనుకగాని , గొర్రుతో గాని ఫర్టికమ్ సీడ్ డ్రిల్ తో గాని వేసుకోవచ్చు.
యంత్రాలతో వరి నాట్లు :
పొలాన్ని చదును చేసుకొని, దమ్ము చేసుకోవాలి.
నారు పెంచడం: యంత్రాల ద్వారా నాట్లు వేసుకునేటప్పుడు నారును ట్రే లలో పెంచాలి.
విత్తన మోతాదు: 12-15 kgs / ఎకరానికి
నారు వయస్సు : నారు వయస్సు 14-17 రోజులు, నారు పొడవు 15 cm కు మించకూడదు.
నాట్లు వేయటం: యంత్రాల ద్వారా నాట్లు వేసినప్పుడు వరసల మధ్య దూరం 1 అడుగు(30cm ) ఒక వరుసలోని మొక్కల మధ్య దూరం 12-21cm వరకు మార్చుకోవడానికి అనువుగా ఉంటుంది. నాట్లు కుదురుకు ఎన్ని మొక్కలు నాటాలి మరియు ఎంత లోతులో నాటాలి అనే నియంత్రణ ఉంటది.
Also Read: Vermiwash: వర్మీవాష్ తయారీ మరియు వ్యవసాయంలో వర్మీవాష్ యొక్క ప్రాముఖ్యత