Curry Leaves: ఇరు తెలుగు రాష్ట్రాలలో వంటకాలలో కరివేపాకు లేని కూర ఉండదు. కానీ మనం దానిని తినకుండా పక్కన పడేస్తాము. చాలామంది రుచి కోసం మాత్రమే దీనిని కూరలలో వాడుతారు. కానీ దీనిలో అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కమ్మని రుచి, వాసన దీనికి సొంతం. పూర్వికులు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారంటే కరివేపాకు తిన్నడం వల్లనే అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు కరివేపాకు సాగు కొన్ని వందల ఎకరాల్లో చేపట్టారు. ఏడాదిలో మూడు సార్లు కోతలు కోయవచ్చు.
తక్కువ పెట్టుబడితో ఆధిక లాభాలను తీయవచ్చు. కరేవేపాకులో మార్కెటింగ్ మెళకువలు తెలిస్తే చాలు పక్కా ప్రణాళికతో పంటను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు. ఈపంట ద్వారా లక్షలు సంపాదించవచ్చు అని రైతులు అంటున్నారు. అయితే వాతావారణ పరిస్ధితుల కారణంగా రేట్లు పూర్తిగా తగ్గిపోతున్నాయని రైతులు అంటున్నారు. ప్రసుత్తం కిలోకి రెండు రూపాయిలు మాత్రమే దక్కుతున్నాయని గిట్టుబాటు ధర దక్కక పొలంలో పంటను పడి వేస్తున్నామని రైతులు అంటున్నారు.
Also Read: Date Palm Cultivation: కాసుల పంట ఖర్జూరం, ఒక్కసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి..
పాతాళానికి పడిపోయిన ధరలు
నిన్నటి వరకు బాగా పలికిన కరివేపాకు ధరలు నేడు పాతాళానికి పడిపోయాయి. లాభాలు చేవుడేరుగు, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు. మొన్నటి వరకు టన్ను రూ.35 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. కోసిన కోత కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి. దీంతో పొలంలోనే వదిలివేస్తున్నారు. పూదీన కొత్తిమీరతో పాటు కరేనేపాకు కూడా ధరలు బాగా పలకడంతో ఎక్కువమంది రైతులు సాగును పెంచారు. సుమారు ఎకరంలో రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుందని కానీ పెట్టుబడులు కూడా రావడం లేదని. తోటల్లోనే ఆకును కోయకుండా వదిలేస్తున్నామని రైతులు అంటున్నారు.
ఎగుమతులకు కూడా అవకాశం లేదు
మొన్నటివరకు కరివేపాకుకు డిమాండ్ ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వచ్చి కరివేపాకును కొముగొలు చేసేవారని ఇప్పుడు ఆపరిస్థితి కనిపించడం లేదని అన్నారు. మధ్యలో దళారుల దందా పూర్తిగా కొనసాగుతుందని రైతులు అంటున్నారు. అన్ని పంటలాగానే ఈపంటలో కూడా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. అసలు 10 రోజులు నుంచి కరివేపాకును కొనేవాళ్లు లేరని రైతులు అన్నారు. మూడు నెలలు వరకు ధరలు భాగానే ఉన్నాయని వర్షాలు నేపధ్యంలో ధరలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఎగుమతులకు కూడా అవకాశం లేకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు.
Also Read: Coconut Crop: కొబ్బరిలో అదనపు ఆదాయం.!