Pulses Cultivation: మన దేశంలో,రాష్ట్రంలో ధాన్యపు పంటల తర్వాత అపరాల పంటలే కీలకం. ప్రోటీన్లు పుష్కలంగా లబిస్తాయి. నేలకు సేంద్రియ పధార్థని అందిస్తాయి.గాలిలో నత్రజని ని స్తిరికరించి ,పంటలకు అందజేస్తాయి.దగ్గరగా వేసే పంటలు కాబ్బట్టి నేల కోతను నిలవరిస్తాయీ. తక్కువ కాలపరిమితి వలన రెండవ ,మూడవ పంటగా సాగు చేయవచ్చు. దేశ ఆహారల అవసరం కోసం సాగు విస్తీర్ణం పెంచాల్సి ఉంది ,బాగంగా రాష్ట్ర ప్రబుత్వం అపరాల సాగుకు సహకరిస్తుంది.

Indian Pulses
కంది : కంది తెలంగాణాలో సుమారు 2.75 లక్షల హెక్టార్లలో ముఖ్యంగా మహబూబ్ నగర్ , ఆదిలాబాద్ .రంగారెడ్డి, మెదక్ ,నల్గొండ , వరంగల్, ఖమ్మం లో సాగు చేస్తున్నారు. ఎర్రచెల్క , నల్ల రేగడి నేలలు ,మురుగు నీరు పోయే వసతి గల నేలలు అనుకూలం.

Red Gram
కంది పంటను వానాకాలంలో ,యసంగిలో ను వేయవచ్చు . LRG-41, లక్ష్మి (ICPL-85063), ఆశ (ICPL-87119), మారుతీ (ICP-8863), WRG-27 , పాలెం కంది, CRG -176 (ఉజ్వల) RGT -1 (తాండూరు తెల్ల కంది) రకాలు అందుబాటులో ఉన్నాయి.
వానాకాలంలో రకాన్ని బట్టి 150-180 రోజులు , యసంగిలో 130-140 రోజులు పంట కాలం కలిగి ఉంటుంది . కంది పంటను వానాకాలంలో జూన్ 15 నుండి జూలై 15 వరకు , యసంగిలో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు సాగు చేసుకోవచ్చు . రకాలను బట్టి ,నేలలను బట్టి ఎకరానికి 6-10 క్వింటాల్ దిగుబడిని పొడవచ్చు.
పెసర : పెసర ఎక్కువగా సూర్య పేట , సంగారెడ్డి , మహబూబ్ నగర్ , వికారాబాద్ , ఖమ్మం లో సాగు చేస్తారు. తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో వేయవచ్చు .

Green Gram
పెసర లో MGG – 295 , WGG – 37 (ఏకశిల), T. M -96-2, MGG-348 (భద్రాద్రి) , MGG -347(మదిర పెసర ), WGG -42 (యదాద్రి) రకాలు అందుబాటులో ఉన్నాయి.
పెసరను ఖరిఫ్ వరి తర్వాత సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు,వేసవి లో ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు సాగు చేయవచ్చు. రకాన్ని బట్టి ,నేలను బట్టి ఎకరానికి 4-6 క్వింటాల్ దిగుబడి వస్తుంది.
Also Read: పప్పుధాన్యాల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు
మినుము : సంగారెడ్డి, ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, వికారాబాద్ , కామారెడ్డి , జిలాల్లో ఎక్కువ గా సాగు చేస్తారు . తేమను పట్టి ఉంచే అన్ని రకాల భుములో సాగు చేయవచ్చు . బరువైనా నల్లరేగడి అనుకూలం .

Black Gram
మినుములో LBG – 752 , LBG – 20 ,WBG-20, LBG-623 , WBG-26, MBG-207, PU-31 అందుబాటులో ఉన్నాయి.
మినుమును ఖరిఫ్ వరి తర్వాత సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు,వేసవి లో ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు సాగు చేయవచ్చు. రకాన్ని బట్టి ,నేలను బట్టి ఎకరానికి 4-8 క్వింటాల్ దిగుబడి వస్తుంది.
శనగ : జోగులాంబ గద్వాల్, కామారెడ్డి , సంగారెడ్డి ,ఆదిలాబాద్ జిల్లాలు బాగా అనుకూలం.తేమను బాగా పట్టి ఉంచే మధ్యస్థ నల్లరేగడి అనుకూలం.

Brown Gram
సాదారణంగా 90-110 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది . స్వల్ప కాలిక రకాలు 80-90 రోజులు పంట కాలం ఉంటుంది .
అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు అనుకూల సమయం . శనగ లో దేశ వాలి రకాలు JG-11, JG-130 , నంద్యాల శనగ -47, నంద్యాల శనగ -1, కాబూలి రకాలు- KAK-2 అందుబాటులో ఉన్నాయి.
రకాన్ని బట్టి నేలను బట్టి ఎకరానికి 6-12 క్వింటాల్ దిగుబడి వస్తుంది .
Also Read:తెలంగాణాలో పప్పు ధాన్యాల కొరత…