Intercropping Onion: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది ఇది అక్షరాల నిజం. ఇది కాయగూర మాత్రమే కాదు. దివ్వ ఔషదం కూడా. ప్రజలు వంటకాలలో దీనిని నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది రుచి, సువాసనను అందిస్తుంది. అంతేకాకుండా దీన్ని సలాడ్ రూపంలో కూడా తీసుకుంటారు. భారతదేశం నుండి వివిధ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేస్తారు. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలును ఎక్కువగా పండించే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.
తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలంగా మారాయి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడంతో రైతులు సాగును తగ్గిస్తున్నారు. అంతేకాకుండా తెగుళ్లు, చీడల బెడద ఉల్లిని చుట్టు ముట్టుతున్నాయి. దీంతో సాగు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతుంది. దిగుబడులు కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉల్లి వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. సాగులో మెలకువలు పాటించినట్లయితే ఉత్పత్తులు గణనీయంగా పెంచవచ్చు.
Also Read: Mosambi: జూదంలా మారిన బత్తాయి సాగు
రబీలో అధిక దిగుబడులు
ఉల్లిపాయలను ఖరీఫ్ అనగా ఆగష్టు – నవంబర్ మరియు రబీ అనగా ఏప్రిల్ – జూన్ లలో సాగు చేస్తారు. కాని మనకు అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలో మాత్రమే. వచ్చిన దిగుబడులను నిల్వచేయడంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మార్కెట్లో మంచి లాభాలను పోందవచ్చు. ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి బెడ్‌లను భూమి నుంచి 10-15 సెం.మీ.ల ఎత్తులో నిర్మించుకోవాలని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రతి రెండు బెడ్ ల మధ్య కనీసం 50సెం.మీ.లు దూరం ఉండేలా చూసుకోవాలి. ఉల్లి సాగులో డ్రిప్ ద్వారా ఎక్కువ దిగుబడిని పొంది సరైన లాభాలను ఆర్జించవచ్చు.
బెండ, బీట్‌రూట్, ముల్లంగిల మధ్య ఉల్లి
ఒకే సంవత్సరంలో వరసగా ఉల్లిసాగు చేయకూడదు. దీనివల్లన భూమి సారము తగ్గిపోతోంది. దాని స్ధానంలో జాతి పంటలను వేయడం ద్వారా నేల సారవంతంగా మారుతోంది. కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంటగా సాగు చెయ్యవచ్చు. అంతేకాకుండా బెండ, బీట్‌రూట్, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు ఎక్కువగా ఉంటాయి. కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు సూచనల ప్రకారం ఉల్లిని సాగు చేసుకోవాలి.
Also Read: Insect Pests of Rose Plants: గులాబీ లో తెగుళ్ల బెడద, సస్యరక్షణ చర్యలు.!