Millets Cultivation: భారతదేశంలో చిరకాలంగా చిరుధాన్యాలు సూపరచితం. మరియు సాగులో 50% విస్తీర్ణంతో అధిపత్యం చెలాయించాయి. సహజంగానే స్వల్ప ఖర్చుతో సేంద్రియ పద్ధతులతో ఏ రసాయనాలు వాడకుండా పండిస్తూ పౌష్టికాహారంలో ముఖ్యపాత్రను పోషించాయి. కానీ కాలక్రమేణా చిరు ధాన్యాలలో అధిక దిగబడినిచ్చే నూతన వంగడాలు, నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం సమగ్ర సమాచార అవగాహన లోపం ప్రాసెసింగ్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు సరళిలో మార్పు రీత్యా వీటి సాగు విస్తీర్ణం మరియు వినియోగం క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులలో బెట్టను దీటుగా తట్టుకొని రైతుకు స్థిరమైన ఆదాయం ఇవ్వగల సామర్థ్యం చిరుధాన్యాలకు మాత్రమే ఉంది
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న పోషకాహార రోగనిరోధక శక్తి లోపం అధిగమించుటకు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, సమపాళ్ళలో సంతులిత ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. సహజ రీతిన అధిక పోషకాలందించే చిరుధాన్యాలు ఔషధ గుణాలు కూడా కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యానికి వరాలుగా చెప్పవచ్చును. అలనాడు సామాన్యుని తిండి చిరుధాన్యాలు నేడు ఒక విలాసంగా మారిపోయింది. వీటిలో సమృద్ధిగా పోషకాలు మరియు అధికంగా పీచు పదార్థాలు ఉండటం వలన పిండి పదార్థాలు మెల్లగా జీర్ణమై రక్తంలోకి నెమ్మదిగా గ్లూకోజ్ విడుదలవుతోంది దీని కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు గ్లూకోజ్ అదుపులో ఉండడమే కాకుండా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Telangana Govt Schemes For Farmers: రైతులకు భరోసాని ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.!
భారత ప్రభుత్వ ప్రతిపాదన ఆమోదిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దేశీయంగా మరి అంతర్జాతీయంగా చిరుధాన్యాల వినియోగం పెంపొందించడానికి మరి బ్రాండింగ్ వచ్చే విధంగా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మద్దతుగా ప్రోత్సాహకాలు ప్రకటించడం శుభ పరిణామం. ప్రజా పంపిణీ విధానంలో చేర్చి పోషక ధాన్యాలుగా గుర్తించడం మరి ప్రజల్లో నానాటికి ఆరోగ్యదాయకమైన ఆహారం పట్ల పెరుగుతున్న చైతనం ద్వారా చిరుధాన్యాలు వినియోగం మెరుగుపడింది. ఇటీవల కాలంలో మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి అతి తక్కువ పెట్టుబడితో సులభంగా మంచి దిగుబడును పొందడం ద్వారా రైతాంగం అధికంగా చిరుధాన్యాలు సాగుకు మొగ్గు చూపుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఒక చిన్న కారు రైతులు జొన్న, సజ్జ, కొర్ర, రాగి పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు కొద్దిపాటి విస్తీర్ణంలో అక్కడక్కడ సామ, పరిగ, అరికలు మరియు ఊర పంటలు సాగుబడిలో ఉన్నాయి. కానీ ఈచిరుధాన్యపు పంటలలో రైతులు సాధారణ రకాలను వాడటం వల్ల తక్కువ దిగుబడిలను పొందుతున్నారు. ఈ క్రమంలో చిరుధాన్య పంటలు పూర్వం వైభవం మరియు అధిక దిగుబడి సాధించడానికి రైతులు తమ ప్రాంతాలకు అనువైన నూతన రకాల ఎంచుకొని మంచి మెలకువలు పాటిస్తే చక్కని లాభాలు పొందవచ్చు. అలాగే రైతుల సొంతంగా శుద్ధి చేసి విలువ జోడించి వివిధ రకాల ఆహారోత్పత్తులను తయారు చేసి విక్రయిస్తే అధిక నికరాదాయం ఆర్జించవచ్చు.
అత్యధిక పోషక విలువల కలిగి బెట్టను తట్టుకునే చిరుధాన్యపు పంటల సాగు రైతుకు ఆర్థిక భద్రతను ప్రజానీకానికి ఆహార ఆరోగ్య భద్రతను మరి పర్యావరణ పరిరక్షణకు సహకరించగలరు అనడం అతిశయక్తి కాదు. చిరుధాన్యాలను సంవత్సరంలో ఎప్పుడైనా అదునులో సాగు చేయవచ్చును. సాధారణంగా వర్షాధారపు పంటగా జూన్, జూలై మాసం బాగా అనుకూలమైన మాసం. కానీ వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు చిరుధాన్యాలను ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు రెండో పక్షంలో కూడా ఎత్తుకొని మంచి దిగుబడులను పొందవచ్చు.
Also Read: Organic Farming Health Benefits: సేంద్రియ వ్యవసామయే ఆరోగ్యం.!