Black Gram Cultivation: భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో మినుము పంటని సాగు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో మినుము పంటని 13.8 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 3.66 లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. ఎకరాకు 266 కిలోల దిగుబడిని పండిస్తున్నారు. రాష్ట్రంలో మినుము పంటను తొలకరిలోనూ, రబీలోనూ, వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు. భారతదేశంతో పాటు పాకిస్తాస్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, ఆఫ్రికా దేశాలలో కూడా మినుము పంటను సాగు చేస్తున్నారు.
వాతావరణం:
పంటకు వెచ్చని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మినుము పంటకు 600-1000 ఎం.ఎం వర్ష పాతం ఉన్న ప్రాంతాలలో మంచి దిగుబడితో పండిస్తారు.
విత్తే సమయము :
ఖరీఫ్: జూన్-జూలై.
రబీ – అక్టోబర్.
వరి కోసిన తర్వాత మాగాణి పొలాల్లో నవంబర్- డిశంబర్.
వేసవి – ఫిబ్రవరి – మార్చి.
రబీ మినుము:
1. రబీలో మినుము పంటను వరి పంట అంచులో పండించడం మన రాష్ట్ర ప్రత్యేకత
2. వరి కోయడానికి రెండు మూడు రోజులు ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలకెత్తిన భూమిలోని మిగిలిన తేమను, సారాన్ని ఉపయోగించి పెరిగి పంట కోతకు వస్తుంది.
3. ఈ పద్ధతిలో భూమిని తయారు చేయటం, అంతర పంటగా పండించిన ఈ పంటకి ఎరువులు వాడకం వీలు కాదు.
4. వరి పంటలో మినుము సాగులో కలుపు సమస్య అధికంగా ఉంటుంది.
Also Read: Milk Production: పాల వినియోగం పెరుగుతుంది.. పశువుల సంఖ్య తగ్గుతుంది.!
నేలలు:
1. మినుము అన్ని రకాల నేలల్లో పండించ వచ్చు.
విత్తన శుద్ధి:
కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బో సల్ఫాస్ 25 గ్రాములు, థైరమ్ 25 గ్రాములు మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి.
ఎరువులు:
1. చివరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, వేసుకోవాలి. రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
2. వరి పంటతో మినుము పంట సాగు చేసే టప్పుడు ఎరువులు వాడనవసరం లేదు.
నీటి యాజమాన్యం:
1. తొలకరిలో వర్షాలు తగినమోతాదు కంటే తక్కువ ఉంటే ఒకటి లేదా రెండు తడులు ఇస్తే దిగుబడి మంచిగా వస్తుంది.
2. రబీ, వేసవి, వరి పంటలో ఒకటి లేదా రెండు తేలిక పాటి తడులు నాటిన 30 రోజులలోపు , 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు వస్తాయి.
కలుపు నివారణ:
1. విత్తే ముందు ఫూక్లోరాలిస్ (టెసాలిస్) ఒక లీటరును, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలిసేలా దున్నాలి.
2. విత్తిన వెంటనే కానీ లేదా తర్వాత రోజు కానీ పిండి మిథాలిస్ ఎకరానికి 1.6 లీటర్లను, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కోత:
తొలకరిలో ఎండిన కాయలను రెండు సార్లు కోసి ఎండ బెట్టుకొని నిల్వచేసుకోవాలి. రబీ, వేసవి కాలం పంట మొక్కలను మొదలు వరకు కోసి ఎండిన తరువాత నిల్వచేసుకోవాలి .
Also Read: Punganur Cow: ఈ కొత్త రకం ఆవుల పాలలో ఎక్కువ పోషక విలువలు..