Rainy Season Suitable Crops: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 743.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 22% అధికం. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలో ప్రాజెక్ట్ లలో నీరు తక్కువగా ఉండటంతో ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాంతాలకు నీరు విడుదల చేయడం జరగలేదు. వరి సాగు చేసే భూముల్లో రైతాంగం పంటలు ఎత్తుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ సాగు చేసుకోదగ్గ పంటల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థ డాక్టర్ పి రఘురాం రెడ్డి సూచనలు చేస్తున్నారు
నీటి వసతి నేలరకం ఆధారంగా విత్తుకోదగ్గ పంటలు అయినా వర్షాధారము తేలిక లేదా మధ్యస్థ నేలలు బరువైన నేలలు వేసుకోవలసిన పంటలు ఏమిటంటే ఉలవలు, బొబ్బర్లు, జొన్న వేసుకోవాలి. నీటి వసతి ఉన్నవాళ్లు తేలిక లేదా మద్యస్థ నేలలు బరువైన నేలల్లో పెసర, మినుము, కంది, వేరుసెనగ, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న మరియు ఆముదం పంటలను వేసుకోవాలి. మరి మాగానుల్లో మొక్కజొన్న, కంది, ప్రొద్దు తిరుగుడు, ఆముదము మరియు ఇతర పంటలు సాగు చేస్తున్నప్పుడు అకాల వర్షాల వల్ల అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు నిలబడటం వలన మొక్కలు వేరుకుళ్ళు తెగులు వలన నష్టపోకుండా ఉండటానికి బోదెలు మరియు సాళ్ల పద్ధతిలో విత్తుకోవడం శ్రేయస్కరము.
Also Read: Cabbage – Onion Prices: ఉల్లిగడ్డ ధర పెరిగితే .. ఈ కూరగాయ ధర కూడా పెరుగుతుంది.!
వివిధ పంటలలో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నకు నీటి తడులు ఆరు నుంచి 8 వరకు ఇవ్వాలి అనగా మొదటి నెల రోజుల వరకు మీరు నిల్వ ఉండకూడదు. జల్లు పోత మరియు గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే జొన్న నీటి తడులు నాలుగు నుంచి ఆరు వరకు ఇవ్వాలి. పంట విత్తిన నెల రోజులు వరకు మొవ్వు తొలుచు ఈగ నుండి పంటను కాపాడుకోవాలి. అలాగే కంది నీటి తడులు ఐదు నుంచి ఏడు వరకు ఇచ్చుకోవచ్చు. మరియు దుక్కిలో ఎకరానికి ఒక బస్తా డిఏపి రసానిక ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలి. మొగ్గ రాబోయే ముందు ఖాళీ ఏర్పడే దశలు తప్పకుండా నీరు ఇవ్వాలి. మొగ్గ దశ మరియు కాయలు ఏర్పడే దశలలో నీరు ఎక్కువైన లేదా బెట్టకు గురైన పూత కాత రాలిపోతుంది
పెసర మినుము దీనికి నీటి తడులు నాలుగు నుంచి ఆరు వరకు ఇవ్వాలి. పూత మరియు కాయ తయారయ్యే దశలో పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. వేరుశనగ దీనికి నీటి తడులు ఆరు నుంచి 8 వరకు ఇవ్వాలి. రెండవ తడిని విత్తిన తర్వాత మొలక వచ్చిన 20 నుండి 20 రోజులకు ఇవ్వాలి. పైరులో ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరె వరకు సున్నితమైనది. కనుక ఈదశలో నీరు సక్రమంగా తగు మోతాదులో తీసుకోవాలి. ప్రొద్దు తీరుగుడు దీనికి నీటి తడులు నాలుగు నుంచి ఆరు వరకు ఇవ్వాలి. నేలల రకాన్ని బట్టి పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్రనేలలో ఎనిమిది నుండి పది రోజులు, 15 నుంచి 20 రోజులు నీటి తడులను పెట్టాలి. మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ, మరియు గింజ కట్టే సమయం కీలక దశలు. దీనికి పైరు పూత దశలో ఆకర్షణ పత్రాలు వికసించే దశలో రెండు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. అక్టోబర్ మరియు డిసెంబర్ నెల వరకు తక్కువ ఉష్ణోగ్రత్తలు వల్లన 12 నుంచి 15 రోజులకు నీటి తడులు ఇవ్వాలి. పూత, దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా నీరు ఇవ్వాలి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకొని మెట్ట పంటలు విత్తుకోవాలని సూచిస్తున్నారు.