వ్యవసాయ పంటలు

Cucumber Cultivation: కీరదోసకాయ పంట రక్షణ, నివారణ చర్యలు.!

2
Cucumber Cultivation
Cucumber

Cucumber Cultivation: కీరదోసకాయ పంటకు అనువైన నేలలు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు, సారవంతమైన నీరు ఇంకే నేలలు ఈ పంటకు అనువైనవి. కానీ నీటిని నిలుపుకునే శాతం ఎక్కువ ఉన్న నేలలు ఈ పంటకు పనికి రావు. తీగజాతి మొక్కలను నేల మీద పండించవలసి వచ్చినప్పుడు నీరు ఇంకే తేలిక పాటి లేదా ఇసుక గల చౌక నేలలో మాత్రమే ఈ పంట వేసుకోవాలి.

నేల వదులు అయ్యేలా 2-3 సార్లు దుక్కిని దున్నుకోవాలి. చివరి సారి దున్నే సమయంలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 35 కిలోల మ్యురియేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని చివరి దుక్కి వేసుకొని సిద్ధం చేసుకోవాలి.

పంట వయస్సు 15-20 రోజుల మధ్య మొక్క యొక్క మొదటి రెండు వరుస ఆకులను తొలగించాలి. విత్తిన 20-30 రోజులకు పూత దశలో ఎకరానికి 45 కిలోల యూరియ (నత్రజని) చేసుకోవాలి. పందిరి పద్ధతిలో సాగు చేస్తున్న క్రమములో కింద ఉండే ఆకులను తొలగించాలి, ఇతర కొమ్మలను తొలగించి ఒకే ఒక్క కొమ్మ పైకి పారేవిధంగా చెయ్యాలి. మొక్క పైకి పాకడానికి సపోర్ట్ గా దారాలతో కట్టాలి.

మగ పుష్పల శాతాన్ని తగ్గించి, ఆడ పూష్పల శాతాన్ని పెంచడానికి పూతకు ముందు 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా 2.5 గ్రాముల ఇథరిన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. పూత, కాత రాలిపోకుండా మొక్కపై నిలవడానికి ఒక్క లీటర్ నీటికి 5 గ్రాముల సుక్ష్మధాతు (19:19:19), 0.25 ఎం.ల్ ప్లోనోఫిక్స్ పిచికారి చెయ్యవలెను.

Also Read: Watermelon Cultivation: పుచ్చ సాగు విధానం, తెగుళ్ళు, చీడపీడలు నివారణ.!

Cucumber Cultivation

Cucumber Cultivation

తెగుళ్ళు, చీడ పీడలు:

బూడిద తెగులు: ఈ బూడిద తెగులు ఆశించిన మొక్కల ఆకులపై చిన్న మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకు మొత్తం విస్తరించి ఆకు పండుబారిపోయి రాలిపోతాయి. దీని నివారణకు ఒక్క లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

లీఫ్ మైనర్ : ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపడి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇది చూడటానికి ఎలుకల బోరియ(కన్నం) లాగా ఉంటాయి. ఈ తెగులు వల్ల మొక్క ఆకుపై తెల్లని చారలు ఏర్పడుతాయి. దీని వల్ల మొక్కకు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ తగ్గుతుంది. దీనివల్ల మొక్కకు మరియు కాయల అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.

నివారణ చర్యలు:

లీఫ్ మైనర్ తెగులు సోకినా తెల్లని చారలు ఉన్న ఆకులను వెంటనే మొక్కనుండి తొలగించాలి. అలాగే వేపనునే 3-4% నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ తెగులు ఎక్కువగా వ్యాపించి ఉంటే ట్రయాజోఫోన్ లీటర్ నీటిలో 1 మీ.లీ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

పేనుబంక : పేనుబంక రసంపీల్చడం వల్ల మొక్క పెరుగుదలను దెబ్బ తీస్తుంది. పొడి మొక్కకు నీటి ఒత్తిడి ఉన్నప్పుడు పెనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మొక్క లేత ఆకు నుండి రసం పీల్చడం వల్ల మొక్క నిరసనగామరి ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మరుతాయి.

నివారణ చర్యలు

మోనోక్రోటోఫోస్ 1.5 మీ.లీ. లేదా డైమీతోయేట్ 2 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

తామర తెగులు:

తామర తెగులు ఆశించిన పంట చేనుకు నివారణ చర్యగా ఒక్క లీటర్ నీటికి 2 మీ.లీ డైమితోయేట్ లేదా 3 మీ.లీ ఇమిడాక్లోప్రిడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

వెర్రి తెగులు:

ఇది వైరస్ ద్వారా ఏర్పడుతుంది. దీనివల్ల పూత మరియు కాత నిలవకుండా రాలిపోవడం కానీ, మొక్కలు గోడు బారిపోవడం జరుగుతుంది. ఈ తెగులు బారిన పడ్డ మొక్కలను పంట చేను నుండి తొలగించివేయ్యాలి.

Also Read: Marigold Cultivation: బంతిపూలు ఏడాది పొడవునా సాగు.. రైతులకి మంచి లాభాలు.!

Leave Your Comments

Watermelon Cultivation: పుచ్చ సాగు విధానం, తెగుళ్ళు, చీడపీడలు నివారణ.!

Previous article

Bitter Gourd Cultivation in Canopy Method: పందిరి పద్దతిలో ఈ కూరగాయ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.!

Next article

You may also like