Contingency Crop Planning: సాధారణ వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవించినపుడు లేదా ఊహించని పరిస్థితులు ఎదుర్కొనుటకు తయారుచేసిన ప్రణాళిక ను “ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక” అంటారు.
శీతోష్ణ స్థితి మూలకాలో ‘వర్ష పాతం’ వ్యవసాయం చేయుట లో ముఖ్య పాత్ర వహిస్తుంది. మిగిలిన వాతావరణ మూలకాలు (ఉష్ణోగ్రత, నీటి అర్ధత మొదలైనవి) హెచ్చు తగ్గులు పంట పెరుగుదల, దిగుబడులపై అంత ప్రభావం చూపించవు. అందువలన వర్షపాతం లో మార్పులు –
· ఋతుపవనాలు ఆలస్యం గా మొదలగుట
· దీర్ఘ కాల మెట్ట పరిస్థితులు సంభవించుట
· వర్ష పాతం తక్కువగా పడుట
నల్ల నేలలు: (అనంత పూర్ జిల్లాలో కొంత భాగము, కడప, కర్నూలు, చిత్తూరు, జిల్లాలు) వర్ష పాతం 500-600 cm., దీనిలో 50 శాతం సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో కురుస్తుంది. రబీ సీజన్ లో ముఖ్య పైర్లు సాగు చేస్తారు.
సాధారణ పరిస్థితులు: సాధారణ మరియు మంచి సీజను లో అన్ని రబీ పంటలను అక్టోబర్ నెలకు బదులు సెప్టెంబర్ లో విత్తుతారు. ముందుగా జొన్న, తర్వాత కుసుమ మరియు ఆఖరున శనగ విత్తుతారు. అధిక మొక్కల సాంద్రత మరియు ఎరువు మోతాదులను తగు సమయాల్లో విధిగా వేసుకోవాలి.
ఋతుపవనాలు ఆలస్యం అయినపుడు: సెప్టెంబర్ వర్షాలు ఆలస్యం అయినపుడు, అక్టోబర్ లో విత్తుకోవాలి. కాని విత్తన తర్వాత వర్షం పడే అవకాశం తక్కువ. అందువలన విత్తే టప్పుడు నెలలో లభ్యమయ్యే తేమను బట్టి పైర్లను ఎన్నుకోవాలి.
దీర్ఘ కాల బెట్ట పరిస్థితులలో సెప్టెంబర్ నెలలో 50 మి. మీ లేక అధికం గా వర్షం పడినపుడు ఎత్తు కోవాలి. నేలను త్వరితం గా తయారు చేసికొని త్వరగా విత్తుకోవాలి.
వర్షపాతము తక్కువగా ఉన్నపుడు: జొన్న పంట విత్తిన 30-40 రోజుల తర్వాత మొక్కలను పలుచగా చేయాలి. అక్టోబర్ లో వర్షాన్ని బట్టి ప్రతి ప్రక్క వరుసను లేదా మూడవ వరుసను తీసివేయాలి. అంతర సేద్యం చేయడం వల్ల పై మట్టి రేణువులు ధూళి మర్చి (dust mutch) గా తయారయి భాష్పోత్సేకాన్ని తగ్గించడం వల్ల నేలలో తేమ ఆదా చేయవచ్చు. మిశ్రమ పంటలు వేసినపుడు కుసుమ, వేరుశనగ వుంచి జొన్న తీసివేయాలి.
ఎర్ర నేలలు: హైదరాబాద్ ప్రాంతం; హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల సరాసరి వర్ష పాతం 750 మీ. మీ మాత్రమే. ఖరీఫ్ పైర్లు సాగు చేస్తారు.
సాధారణ మరియు మంచి సీజన్: మే నెల లో వర్షాలు పడిన వెంటనే విత్తుకోవాలి. సాధారణం గా జొన్న, ఆముదాలు వేస్తారు. జూన్ లోకూడా చేసుకోవచ్చు. అయితే విత్తుట ఆలస్యమయ్యే కొద్ది చీడ పీడలు తాకిడి ఎక్కువ అవుతుంది. సాధారణం గా అంతర పంటలను (జొన్న +కంది, సజ్జ +కంది లేదా జొన్న + వేరుశనగ) వేసుకోవాలి.
ఋతుపవనాలు ఆలస్యమైనపుడు: జులై మధ్య నుండి ఆగష్టు మధ్య వరకు రాగి పంటను విత్త వచ్చు ఆగస్టు మధ్య నుండి సెప్టెంబర్ వరకు అలసంద విత్తాలి.
దీర్ఘ కాలిక మెట్ట పరిస్థితులు ఉన్నపుడు: కలుపు తీత, మట్టి దూళి మల్చింగ్ చేయాలి. వర్షాలు సెప్టెంబరు లో పడినచో జొన్నను కోసిన తర్వాత పిలక పంట గా మార్చాలి. పిలక పంట చేసేముందు హెక్టేరు కు 20 కిలోల నత్రజని – సగ భాగము నేలలోను, మిగిలిన సగ భాగము పిచికారి ద్వారా అందించాలి.
వర్షపాతము లోటు గా ఉన్నపుడు: స్వల్ప కాలిక జొన్న లేదా సజ్ఞ రకాలను విత్తుకోవాలి.
వర్ష పాతం లోటు గా ఉన్నపుడు: జొన్న (CSH-6), సజ్జ స్వల్ప కాలిక రకాలు వేసుకోవాలి. అంతర పంటలు (వేరుశెనగ, కొర్ర,సజ్జ, కంది) 5:1 నిష్పత్తి లో వేసుకోవాలి.
సీజను మధ్యలో సవరించుట: (mid season correction) – జొన్న, సజ్జ పంటలను పిలక పంటలు గా మార్చుట,మొక్కల సాంద్రత ను పలుచగా చేయుట,మిశ్రమ పంట లలో తేమ కొరత ను తట్టుకోలేని పంటలను తొలగించుట,ఆకులపై పోషకాలను పిచికారి చేయడం పై సవరణలు ప్రధానం గా నల్ల రేగడి నేలల్లో రబీ సీజన్ లో పాటిస్తారు.