Pearl Millet Seed Production: వరి, మొక్కజొన్న, జొన్న, తర్వాత పుష్కలమైన పోషకాలు ఇచ్చే ఆహార పంట సజ్జ. భారతదేశంలో సజ్జ పంటను అధిక విస్తీర్ణంలో పండించే రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సజ్జ సంకరజాతిని నిజామాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నారు. సజ్జ పంటను రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో జనవరి నుండి ఫిబ్రవరి బాగా అనుకూలమైన సమయం మరియు వేసవిలో విత్తనోత్పత్తిని చేయటం వల్ల కీటకాలు, సిలింద్రాలు తక్కువగా ఆశించి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
అనుకూలమైన వాతావరణం అనేది విత్తనోత్పత్తికి చాలా ముఖ్యం. సారవంతమైన నేలలు, తేలక నుండి మధ్యరకం నేలలు, నీరు ఇంకే మురుగు నీటిపారుదల గల నేలలు అనుకూలము. సమస్యాత్మక భూములకు ఎంపిక చేయలేదు. అదే నెలలో క్రితం వేసిన పంట, ఇప్పుడు వేస్తున్న పంట ఒకటి కాదు. నేలలు ఏర్పాటు దూరంను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకోవాలి. ఈ పంటకు నీటి వసతి అనేది చాలా ముఖ్యం.
ఎరువులు చాలా ముఖ్యం
సజ్జకు ఎరువుల యాజమాన్యం అనేది చాలా అవసరం. ముఖ్యంగా పశువుల ఎరువు పది టన్నులు హెక్టార్ కు దుక్కిలో వేసి కలయదున్నాలి. హెక్టార్ కి 60 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసి దుక్కిలో కలయదున్నాలి. తర్వాత నీరు పెట్టి 14- 21 రోజుల్లో నారు ముఖ్యమైన పొలంలో పైన ఉదహరించిన రీతిన రెండు వరసలు మగ మొక్కలు, ఆరు -ఎనిమిది వరుసలో ఆడమొక్కలు నాటాలి.
Also Read: Tomato Pests and Diseases: టమాట పంటలో తెగుళ్లని ఎలా నివారించుకోవాలి.?
సగభాగం నత్రజనిని 30 రోజులు వ్యవధిలో వేసి నీరు కట్టాలి. నారు నాటే వేళ, గింజ పాలు పోసుకునే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. తేలిక నేలలో వారం రోజులకు ఒకసారి బరువు నేలల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి నీరు అందించాలి. నారుమడిలో మొదటి 20 రోజుల్లో సస్యరక్షణ చర్యలు చాలా ముఖ్యం
విత్తనోత్పత్తికి సూచనలు
సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి కనీసం 2 దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతి కట్టాలి. అన్ని రకాల పంటల నూర్పిడి యంత్రం తో ఈ పంట కంకులను బాగా ఆరబెట్టిన తర్వాత నూర్పిడి చేసుకోవచ్చు. సజ్జ హైబ్రిడ్ విత్తనోత్పత్తిని రబీ లేదా జనవరి మాసంలో చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి.
సర్టిఫైడ్ హైబ్రిడ్ విత్తనోత్పత్తికి కనీసం 200 మీ. వేర్పాటు దూరం పాటించాలి. 6-8 ఆడ మొక్కలు వరుసలకు, 2 మగ మొక్కలు వరుసలు ఉండేలా నిష్పత్తిని పాటించాలి. పిలకలు వేసేటప్పుడు మరియు పూత దశలో కేళీలను గుర్తించి వేరు చేయాలి. సాధారణంగా మగ మొక్కల వరుసలను ముందు కోసి తర్వాత ఆడ మొక్కల వరుసలను కోయాలి.
Also Read: Nutrient Deficiency In Plants: మొక్కలో ఎరువుల లోపాన్ని గుర్తించి వాటిని నివారించడం ఎలా.?