Coconut Fruit Drop: రాష్ట్రంలో కొబ్బరి లక్ష హెక్టార్లలలో సాగుచేయబడుతూ సాలీనా 1000 మిలియన్ కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఎకరాకు 4 వేల కాయలు ఉత్పాదకత. నెల్లూరు, గుంటూర్, గోదావరి జిల్లాలు విజయవాడ, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలు సాగుకు అనుకూలo.
కొబ్బరిలో ప్రతి భాగం ఉపయోగకరమైనది. వ్యాపార రీత్యా కొబ్బరి నూనె, ఎండుకొబ్బరి, పీచు ముఖ్యమైనది. చెట్టు కాండాలను వంట చెరుకు, కలపగా ఉపయోగిస్తారు. కొబ్బరిని కల్పవృక్షం అంటారు.
మొక్కల ఎంపిక:
ముందుగా మొలక వచ్చే మొక్కలు ఎన్నుకోవాలి. ఆకుల నుండి ఈనెలు త్వరగా విడిపడే లక్షణమున్న మొక్కలు ఎన్నుకోవాలి. ఒక సంవత్సరం వయసు గల ఆరోగ్య వంతమైన మొక్కలు ఎన్నుకోవాలి. తాటి పాక లేదా గానోడెర్మా, తెగులు సోకిన మొక్కలు ఎంచుకోరాదు. మొక్కలు
నాటుట: నేల పరిస్థితులను బట్టి, ఒక ఘనపు మీటరు లోతు గుంతలను తీయాలి. తీసిన మట్టిలో FYM, 200 గ్రా., SSP కల్పి గోతులను నింపాలి. సూది మొక్కలను గొయ్యి మధ్యలో నాటి, చుట్టూ మట్టి తొక్కి నీరు పెట్టాలి. మొక్కలలోనికి మట్టి, నీరు పోకుండా జాగ్రత్తపడాలి. పొడవు, హైబ్రిడ్ రకాలను 8×8 మీటర్ల దూరంలో పొట్టి రకాలను 7.5×7.5 మీటర్ల దూరంలో నాటాలి.
Also Read: Coconut Planting: కొబ్బరిలో నారు పెంచుట మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!
నీటి యాజమాన్యం: తగినంత తేమ లేకపోతే పూత, పిందెరాలటమే కాక కాయల దిగుబడి తగ్గును. వేసవిలో 3-4 పర్యాయాలు నీరు కట్టడం వల్ల అధిక దిగుబడులను పొందవచ్చు. కాలువల ద్వారా ప్రతి చెట్టుకు విడివిడిగా నీటి వసతి ఏర్పాటు చేసుకోవాలి. తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవటానికి ప్రతి చెట్టుకు 50 గ్రాముల కొబ్బరి పీచు పొట్టు, సేంద్రీయ ఎరువులు మరియు పచ్చి రొట్ట ఎరువులు వేయాలి. డ్రిప్ పద్దతి ద్వారా నీరు కట్టడం వలన నీటిని 2-3 వంతులు పొదుపు చేసుకొనవచ్చు.
పిందెరాలుట – నివారణ:
విత్తన సేకరణ కొరకు ఎంపిక చేసుకొని చెట్టులో ఏదేని లోపం వల్ల పిందెరాలుట సంభవించును. కావున కాయలను ఆరోగ్యకరమైన చెట్ల నుండి ఎంపిక చేసుకోవాలి.తోట పెంచే నెలల్లో అధిక ఆమ్ల లేదా క్షార గుణం ఉన్నా పిందెరాలుట సంభవించును. దీనిని సరిదిద్దుటకు భూసార పరీక్షలను అనుసరించి సున్నం లేదా జిప్సంను తగు మోతాదులో వేయాలి.
తోటలో మురుగు నీరు పారుదల సౌకర్యం లేని యెడల కూడా పిందె రాలుట సంభవించును. కావున చెట్లకు సరియైన మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.ఎరువులను సరియైన మోతాదులో వేయకున్నా పిందెరాలుట సంభవించును. కావునా సిఫారసు చేసిన ఎరువులు మోతాదును సరియైన సమయంలో మొక్క మొదలు నుండి 1మీటర్ దూరంలో మట్టిలో వేసి బాగా కల్పాలి.
నీటి ఎద్దడి లేదా వేసవిలో సరిగా నీటి పారుదల లేకున్నా పిందెరాలుట జరుగును. కావునా తగు సమయంలో చెట్లకు నీరు పెట్టి పిందెరాలుట నివారించవచ్చును. హార్మోన్ లోపం వల్ల కూడా పిందెరాలుట జరుగును నివారణకు 2,4-D 45 PPM ద్రావణంను గెలలపై 4 సార్లు వారం వ్యవధిలో పిచికారి చేయాలి.చీడ పీడల వలన కూడా పిందె రాలుట సంభవించవచ్చు దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. వర్షకాలంలో 2-3 సార్లు బెటాక్స్ 3 గ్రాములు 1 లీటరు నీటిని కల్పి పిచికారి చేయాలి.