Climate Effects On Sugarcane Juice : చెరకు రస నాణ్యత ప్రధానoగా చెరకు పక్వాత మీద ఆధారపడి ఉంటుంది. చెరకు పక్వాత కొన్ని వాతావరణ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. గాలిలో తేమ తక్కువగా ఉండడం కాంతివంతమైన సూర్యరశ్మి, పగటి కాలం తక్కువ గా ఉండి, రాత్రి కాలం ఎక్కువగా ఉండడం పక్వా దశలో తక్కువ వర్షం, లేదా వర్షం లేకుండా ఉండడం. వలన నాణ్యత అనేది తగ్గిపోతుంది.
సూర్యరశ్మి తక్కువగా నుండు ప్రాంతాలలో చెరకు దిగుబడి రసము లో పంచదార, రస శుద్ధిక, పంచదార దిగుబడి అనేది తగ్గిపోతుంది. అంతే కాకుండా రసంలో నత్రజని, పోటాష్ పరిమానాలు పెరిగుతాయి. రోజుకు 12-24గంటల కాలం సూర్యరశ్మి ఉన్నపుడు రసం లో హేచ్చు పంచదార శాతం ఉండి, చెరకులు త్వరగా పక్వానికి వస్తాయి. తగినంత సూర్యరశ్మి లేనప్పుడు సన్నని చెరకులు ఏర్పడి రసం లో పంచదార కూడిన తగ్గుతుంది.
అలాగే వాతావరణం చల్లగా , పొడిగా రాత్రి ఉష్టనోగ్రత్త తక్కువగా ఉన్నపుడు రసం ల్లో పంచదార కూడిన ఎక్కువగా ఉంటుంది. ఉష్టగ్రత్త ఎక్కువగా ఉన్నపుడు పంచదార గ్లూకోస్ గా మారిపోతుంది. ఇక పక్వా దశలో వర్షం పడితే చెరకు పెరుగుదల అనుకూలం గాని చెరకు పక్వాతకు అనుకూలo కాదు. నీరు సేద్యపు నీటిగా కాక వర్షం రూపంలో తోటలకు లభించినప్పుడు ఫలితం బాగుంటుంది. ఎందుకు అంటే వర్షం వాతావరణo ముఖ్యం గా గాలిలో తేమ ను అధికం చేస్తుంది. మరియు చెరకును లాభసాటిగా మార్చుతుంది.
Also Read: Sugarcane Seed Development Methods: చెరకు విత్తనాభివృధిలో పద్ధతులు.!
వర్షాభావ ప్రభావం :చెరకు పంట వర్షాభావానికి గురైనప్పుడు ఎదిగుదల అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా మొలక శాతం, పిలకల సంఖ్య దెబ్బ తింటుంది. నీటి ఏద్దడికి గురైన చెరకు పైరు పురుగులు పీక పురుగు, కాండం తోలుచు పురుగు, పోలుసు పురుగు, తెగుళ్ళు వడ తెగులు ఎక్కువగా సోకుతాయి. చెరువులో కొంచెం నీరు ఉంటే డిసెంబర్, జనవరి మాసలలో నాటుతారు. వేసవి అంత తడి ఉండదు. వర్షరంభం కాగానే పెరుగుట ప్రారంభింస్తాయి. నీటి వసతి ఏమి లేక పోతే అట్టి ప్రాంతాలలో వర్షాకాలం నాటుతారు. ఈ పంట వర్ష కాలంలో పెరిగి. తర్వాత నీటి వసతి లేకపోవడం వలన ఎండలు పెరుగుతున్న కాలం నుండి త్వరతం గా ఎండి పోయి దిగుబడులు, రసనాణ్యతలకు తీవ్రంగా నష్టం జరిగితుంది .
నీటి ముంపు ప్రభావం : వర్షాకాలంలో చెరకు తోటలు నీటి ముంపుకు గురి కావడం తరచుగా జరుగుతుంది. చెరకు తోటలు నీరు నిలువ ఉన్నట్లు అయితే మొక్కకు చలినతా ప్రాణ వాయువు దొరకక తోట పెరుగుదల తగ్గుతుంది. భూమి లోపల వెర్ల వ్యాప్తి మంచిగా లేనప్పుడు సస్య పోషకాలను మొక్క గ్రహీంచే శక్తీ తగ్గుతుంది. తోటలో చూచ్చు చెరకులు ఎక్కువగా వస్తాయి. నీటి ముంపుకు గురైన తోటల పట్టుత్వం తగ్గి పడిపోతాయి. చెరకు గాడాలపై కణుపులు వద్ద వేర్లు వచ్చి మొగ్గలు మొలకేత్తడం వలన చెరకు దిగుబడులు పడిపోతాయి.
Also Read: Sugarcane Farmers: చెరకు సాగుదారుల ఆదాయాన్నిపెంచేందుకు టాస్క్‌ఫోర్స్
Also Watch:
Must Watch: