Castor Threshing: ఆముదం కాయలు వలచు యంత్రము సాధారణముగా ఉపయోగించు శక్తిని మరియు విధానo బట్టి అముదo కాయలను 3 విధాలుగా వలచవచ్చు.
కట్టెలతో కొట్టడం ద్వారా
వలచబడిన కాయల పరిమాణం తక్కువగా ఉన్నచో ఆముదపు కాయలను కళ్లములో గాని లేక ఏదైన గట్టి ప్రదేశములో పలుచగా పరచి కట్టెలతో కొట్టుట ద్వారా కాయల నుండి గింజలను వేరు చేయవచ్చు. ఈ విధానo ను ఉపయోగించి రోజుకు ఒక మనిషి 100 నుండి 125 కిలోల వరకు ఆముదం కాయలను వలచవచ్చు. ఇది ఎక్కువ శ్రమతో కూడుకున్న పని దీని వలన విత్తనాలు పగిలి పోవుటకు అవకాశం కలదు.
చేతితో నడుపు యంత్రం:
పనిచేయు విధానo:
ఇందులో కాయలను ఉంచు తొట్టి గింజలు వెలుపలకు వచ్చు ద్వారము చెక్కలతో చేయబడి సిలిండరు చెక్కలతో చేయబడి కాన్కోవ్లు క్రాంక్విల్ మరియు చక్రములు ఇనుప చట్రములో బిగించబడి ఉంటాయి. హాండీలు మరియు రెండు పళ్ల చక్రం ద్వారా సిలిండరును అధిక వేగంతో త్రిప్పవచ్చు.
Also Read: Cauliflower Physical Defects: క్యాలిఫ్లవర్ లో భౌతిక లోపాలు – వాటి నివారణ.!
సిలిండరు వేగంగా తిరుగునపుడు హపర ద్వారా ఆముదపు కాయలు సిలిండరు కాన్ కేవ్ల మధ్యకు పంపినప్పుడు అవి వాటి మధ్య ఒత్తిడికి కాయలు పగిలి గింజలు మరియు పొట్టు కలిపి గింజలు వెలుపలికి వచ్చు ద్వారం ద్వారా వెలుపలికి వస్థాయి. తర్వాత గింజలను పొట్టునుండి తూర్పార బట్టించి వేరు చేస్తారు. దీనిని ఉపయోగించి రోజుకు 800-900 కిలోల వరకు కాయలు వలచవచ్చు.
మోటరు సహాయoన పనిచేయు యంత్రo:
పనిచేయు విధానo:
హపరు ద్వారా అముదపు కాయలు సిలిండరు కాస్కిన్ల మధ్యకు పోయినప్పుడు వాటి మధ్య కాయలు ఒత్తబడి పగిలి పోతాయి. గింజలు మరియు పొట్టు కలసిపోయి మొదటి జల్టెడపై పడుతాయి. అట్లు పడునప్పుడు (బ్లోయరు వలన వచ్చు గాలి ద్వారా) జల్లెడలకు ఒక ప్రక్కగా అమర్చన బ్లోయరు నుండి వీచుగాలి వేగమునకు పొట్టు వెలుపలకు నెట్టబడుతాయి. గింజలు కొంత పగిలిన కాయలు మొదటి జల్లెడపై పడుతాయి. మొదటి జల్లెడపైన రంధ్రములు వలిచిన ఆముదపు గింజలకు సరిపడినంత ఉంటుంది. ఈ రంద్రములు ద్వారా రెండవ జల్లెడపైన పడుతాయి. పగులనవి మరియు రంధ్రముల కంటే పెద్ద ఆకారంలో నున్న రాళ్ళు మరియు ఇతర పదార్థాలు మొదటి జల్లెడ నుండి బయటకు వస్థాయి. ఈ యంత్రoను ఉపయోగించి రోజుకు 2500 కిలోల నుండి 3000 కిలోల వరకు ఆముదం కాయలు వలచవచ్చు.
Also Read: Vegetable Nursery Preparation: కూరగాయల నారుమడి తయారీ.!