Distribution Paddy Farming: రైతులు వరి విత్తనాలు చేతుల ద్వారా చల్లుకొని, 20 లేదా 21 రోజులో నారు తీస్తారు. ఈ వరి నాటుకోవడానికి సిద్ధం చేసిన పొలంలో నారు తీసుకొని ఆ పొలంలో నాటుకుంటారు. ఇలా వరి విత్తనాలని నారుగా చేసుకొని నాటుకోవడం చాలా పెట్టుబడి అవుతుంది. సీడ్ డ్రమ్ పరికరం అందుబాటిలో ఉన్నాయి. కానీ సరైన సమయంలో ఈ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులు ఒక ఉపాయంగా రైతులు వరి విత్తనాలు చల్లుకోవడంలో కొత్త పద్దతిని మొదలు పెట్టారు.
ప్రస్తుతం వరి విత్తనాలని మళ్ళీ చేతుల ద్వారా చల్లడం మొదలు పెట్టారు. కాకపోతే తక్కువ సీడ్ రేట్ వాడాలి. వరి విత్తనాలని విత్తుకునే ముందు విత్తనాలని నీటిలో 12 గంటలు నానపెట్టాలి. నానపెట్టిన వడ్లని పొలంలో తక్కువ పరిమాణం చల్లుకోవాలి. మొక్కల మధ్య 15-20 సెంటి మీటర్ల దూరం ఉండేలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న విత్తనాలని మళ్ళీ నారుగా తీసి నాటుకోవాల్సిన అవసరం ఉండదు.
Also Read: Backyard Curry Leaves Farming: ఇంటి పెరట్లో కరివేపాకును పెంచుతున్న రైతులు.!
చల్లిన విత్తనాలు అలాగే మొక్కగా పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల రైతులకి కూలీల ఖర్చులు తగ్గుతుంది. ఇలా పెంచుకున్న మొక్కలో కలుపు కూడా చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఎక్కువ పురుగుల మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. విత్తన దశ నుంచి మట్టిలో మొలక ఎత్తడం ద్వారా బలంగా పెరుగుతుంది. ఈ మొక్కలకు పిలకలు కూడా ఎక్కువ వస్తాయి.
సాధారణ వరి పంటలో 10 నుంచి 20 పిలకలు వస్తే, ఈ పద్దతిలో పెంచుకున్న మొక్కలకి 25 నుంచి 30 పిలకలు వచ్చే అవకాశం ఉంది. రైతులు విత్తనాలు ఇలా చల్లుకొని మొక్కలుగా పెంచడం వల్ల కూలీల ఖర్చు అసలు ఉండదు. కలుపు తగ్గడంతో కలుపు కూలీల ఖర్చు కూడా తగ్గుంది. వరి పంటకి అధిక నీళ్లు అవసరం ఉండదు. కేవలం 900 మిల్లీ మీటర్ల నీళ్లు ఉంటే చాలు. ప్రతి రోజు 10 మిల్లీ మీటర్లు నీళ్లు మాత్రమే ఇవ్వాలి. దాని వల్ల మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. ఈ పద్దతిని ఇప్పటి వరకు తెలంగాణలో చాలా జిల్లాలో రైతులు ఉపయోగించి మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు.
Also Read: Spine Gourd Pickles: పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తున్న ఆకాకరకాయ.!