నేలలు: వంగ సాగు లోతైన సారవంతమైన మురుగునీరు పోయేలా సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలం. నెల ఉదజని సూచిక 5.5-6.5 ఉండే నేలలు అనుకూలం. బెట్టను మరియు చౌడును కొంతవరకు తట్టుకోగలదు.
రకాలు: గులాబీ, పూస పర్పుల్ లాంగ్, భాగ్యమతి, గ్రీన్ లాంగ్ ,గ్రీన్ రౌండ్, శ్యామల.
విత్తన శుద్ధి: వంగాను విత్తే ముందు ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి తో లేదా బీజారక్షతో విత్తనశుద్ధి చేయాలి.
విత్తన మోతాదు: ఎకరానికి సూటి రకాలు అయితే 260 గ్రాములు సంకర రకాలు అయితే 120 గ్రాములు విత్తనాలు పెంచిన నారు నాటుకోవడానికి సరిపోతుంది.
నాటే కాలం: సాధారణంగా వంగను ఏడాది పొడవునా సాగుచేయవచ్చు వర్షాకాలం పంట జూన్ జూలై శీతాకాలం పండగ అక్టోబర్ నవంబర్ వేసవిక పంటగా ఫిబ్రవరి మార్చిలో విత్తు కొనినాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి.
Also Read: పండ్ల కోత సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలు
నీటి యాజమాన్యం: వందనాలు నాటే ముందు లేదా నాటిన తర్వాత నీటి తడి ఇవ్వాలి . నేల లో తేమ 7-10రోజులకుఒకసారి అదే వేసవిలో అయితే 4 రోజులకోసారి తడి పెట్టాలి. మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలిని తట్టుకోవడానికి ఎక్కువ సార్లు తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పూత కాపు దశలో ఎప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే పూత రాలిపోయే ప్రమాదం ఉంటుంది. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. వేసవిలో కాయ కోతకు కు 1-2 రోజుల ముందు తప్పనిసరిగా తడి ఇవ్వాలి. లేదంటే కాయలో చేదు ఎక్కువవుతుంది.
వంగ సాగు లో చేయవలసిన పనులు: వేసవి దుక్కులు తప్పనిసరిగా చేపట్టాలి. ఖరీఫ్ పంట తర్వాత రబి కొరకు లోతుగా దున్ని ఎండ బాగా పడేవిధంగా చూసుకోవాలి.
ఎకరానికి 1-2క్వింటాళ్ల వేపపిండి తప్పనిసరిగా వేసుకోవాలి. దిని వల్ల భూమిలో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.2 లీటర్ల మూత్రం 1 కిలోల పశువుల పేడ 1 కిలో మట్టి(గట్టు లేదా పుట్టమన్ను) 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాలపాటు నాటుకోవాలి.
నారు నాటిన 20 రోజుల తర్వాత జిగురు పూసిన పసుపు మరియు తెలుపు రంగు డబ్బాలు ఎకరానికి 10 నుంచి 25 పెట్టాలి.
అంతరపంటగా బంతి ,ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి.
ఎకరానికి 20 వేల ట్రైకో గ్రామ బదనిక లను విడుదల చేయాలి.
సస్యరక్షణ:
పురుగులు:అక్షింతల పురుగు, మొవ్వు మరియు కాయతొలుచు పురుగు, పిండి పెరుగు, రసం పీల్చే పురుగులు(పేనుబంక , పచ్చ దోమ, ఎర్రవల్లి), నులిపురుగు వంగ పంటను ఆశిస్తుంది.
తెగుళ్ళు: ఆకుముడత తెగులు ,వెర్రి తెగులు, మొజాయిక్ వైరస్ తెగులు.
పురుగులు నివారణ:
- వంగ పంటను ఆశించే లద్దె పురుగు ,పేనుబంక నివారణకు వావిలాకు కషాయం పిచికారి చేయాలి.
- కాయతొలుచు పురుగు నివారణకు నిమ్మ అస్త్రం లేదా అగ్నాస్త్రం పిచికారీ చేసుకోవాలి.
- పొలంలో రసం పీల్చే పురుగుల,అక్షంతల పురుగు కొరకు పిండి పురుగులు నివారణ కొరకు ప్రతి 20 రోజులకు ఒకసారి తప్పనిసరిగా 5 శాతం వేప కసాయం(5 కిలోల వేప పిండి ,100 లీటర్ల నీటిలో) పంటకాలంలో సుమారు 5 నుంచి 8సార్లు పిచికారి చేయాలి.
- మొవ్వ మరియు కాయతొలుచు పురుగు నివారణకు మాస్ ట్రాపింగ్ (లింగాకర్షక బుట్టలు) ఎకరానికి 40 అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలు తో ఈ పురుగును సమర్ధవంతంగా అరికట్టవచ్చు. లింగాకర్షణ బుట్టలు పంట నాటిన 30 రోజుల నుండి 150 రోజుల వరకు ఉంచాలి.
- మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ఆశించిన కొమ్ములను పురుగు ఆశించిన ప్రాంతంనుండి ఒక అంగుళం కిందకు నాశనం చేయాలి. ఏ విధంగా పురుగు ఆశించిన నష్టం చేసిన కాయలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
- నులిపురుగుల నివారణకు పొలంలో ఎకరాకు 100 నుంచి 120 బంతి మొక్కలు పెంచాలి. దుక్కిలో 200 కిలోల వేప పిండి వేసి కలియదున్నాలి. నులిపురుగు బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పంట మార్పిడి చేయాలి.
- ఎర్ర నల్లి నివారణ కు పొగాకు కషాయం 1 లేదా 2 సార్లు పంటకాలంలో పిచికారి చేయాలి.
తెగుళ్ల నివారణ:
* శిలింధ్ర సంబంధిత తెగులు నివారణ కొరకు పశువుల పేడ , మూత్రం, ఇంగువద్రావణం 3 నుంచి 4 సార్లు తప్పనిసరిగా పిచికారీ చేయాలి.
* ఆకుమాడు మరియు కాయ కుళ్ళు తెగులు నివారణ కు పులిసిన పుల్లటి మజ్జిగ(ఆరు లీటర్ల మజ్జిగ వంద లీటర్ నీళ్లలో) లేదా పశువుల పేడ ,మూత్రం, ఇంగువ ద్రావణం లేదా పిచ్చి తులసి కషాయం(ఐదు కిలోలు వంద లీటర్ నీటిలో) పిచికారీ చేసుకోవాలి.
* వెర్రి తెగులు (వైరస్ వల్ల వస్తుంది). పచ్చ దోమ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపిస్తోంది. నివారణకు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు ఎకరానికి 15 నుంచి 20 పెట్టాలి. లేదా నిమ్మ అస్త్రం పిచికారి చేసుకోవాలి. అధికంగా తెల్లదోమ ఉన్నప్పుడు పొగాకు కషాయం కూడా ఉపయోగించవచ్చు.
Also Read: టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ