Bioethanol: పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా ప్రజలు ఇతర ప్రత్యామ్నాయం గురించి వెతుకుతున్నారు. అయితే ఇందులో ఇథనాల్ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇది పెట్రోలియం లేదా బయోమాస్ (జీవపదార్థం) నుండి ఉత్పత్తి చేయవచ్చు. జీవపదార్థం నుండి తయారు చేయబడిన ఇథనాల్ ను బయోఇథనాల్ అని పిలుస్తారు. బయోఇథనాల్ రసాయనికంగా సాధారణ పెట్రోలియం కన్నా ఏ మాత్రం తక్కువ కాదు. బయోఇథనాల్ తయారు చేయడానికి మొక్కజొన్న, స్విచ్‌గ్రాస్, చెరకు చెత్త, ఆల్గే మొదలైనవి వాడుతారు. జీవ పదార్ధం కిణ్వ ప్రక్రియకు గరి చేసినపుడు, కొన్ని రకాల ఈస్ట్ అనే సూక్ష్మ జీవులు ఫీడ్‌స్టాక్‌లలో ఉన్న చక్కెరను తిని జీర్ణం చేసుకుంటాయి.ఈ ప్రక్రియలో బయోఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ లు ఇతర ఉత్పత్తులు.. ఇథనాల్ ను ప్రధానంగా బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్, యూరోప్ మరియు దక్షిణాఫ్రికా మొదలైన దేశాలలో అధికంగా ఉత్పత్తి చేస్తాయి.
ఆల్కహాలిక్ పదార్థాలలో పాటుగా , ఇథనాల్ అంతర్గత దహన(ఇంటర్నల్ కంబుషన్) ఇంజిన్ లలో, ఇతర గ్యాసోలిన్ యంత్రాల కోసం మంచి ప్రత్యామ్నాయ ఇంధనం.దీనిని గ్యాసోలిన్‌తో వివిధ నిష్పత్తిలో కలిపి ఆటోమొబైల్స్‌లో ఉన్న అన్ని గ్యాసోలిన్ ఇంజిన్‌లు, పెట్రోల్ ఇంజన్ లలో వాడుకోవచ్చు.కాకపోతే ఇథనాల్ తక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది. ఇది , గ్యాసోలిన్ కంటే 34% తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కావున, 1.5 గ్యాలన్ల ఇథనాల్ ఒక గాలన్ గ్యాసోలిన్ కి సరి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఎక్కువ ఇథనాల్ ను వాడాల్సివస్తుంది.
Also Read: PM Kisan Scheme: పీఎం కిసాన్ అనర్హులు తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే
ఇథనాల్, గ్యాసోలిన్ కన్నా ఎక్కువ ఆక్టేన్ రేటింగ్‌ను కలిగి ఉంతుంది.అందువలన అధిక ఒత్తిడి నిష్పత్తులతో ఇంజిన్ డిజైన్‌లకుబానుకులంగా ఉంటుంది. ఇథనాల్ తో నడిచే ఇంజిన్‌లు అధిక ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రూపొందించవచ్చు. ఇథనాల్ తో నడిచే ఇంజిన్ గ్యాసోలిన్ ఇంజన్ తో పోలిస్తే తక్కువ ఉష్ణ శక్తిని వృధా చేస్తుంది. అంటే ఇథనాల్ ను ఇంధనంగా ఉపయోగించే కారు, ఇతర ఇందనాలకన్న మెరుగైన పనితీరును కలిగి ఉండటం గాక తక్కువ ఉష్ణ శక్తిని వృధా చేస్తుంది.
అలాగే, బయోఇథనాల్‌ను వాడినట్లయితే, ఇంజన్ ల నుండి విడుదలయే కార్బన్ డయాక్సైడ్ పంటలను పండించినప్పుడు తీసుకున్న కార్బన్ డయాక్సైడ్ కు సమతుల్యమవుతుంది. ఇది పెట్రోలియంకు చాలా వరకు భిన్నంగా ఉంటుంది, ఇది కోట్ల సంవత్సరాల క్రితం పెరిగిన మొక్కల నుండి కూడా తయారు చేయవచ్చు. శాస్త్రవేత్తలు మొక్కజొన్న-ఆధారిత బయోఇథనాల్ ఉత్పత్తి మెరుగినదిగా పరిగణిస్తారు.దీని వినియోగం వలన గ్యాసోలిన్ వినియోగంతో పోలిస్తే దాదాపు 52% వరకు హరిత వాయువులను తగ్గిస్తుంది.కేవలం బయోఇథనాల్ వాడకం 86% వరకు హరిత వాయువులను తగ్గిస్తుంది.
Also Read: Herbicides: కలుపు మందుల వాడకంలో సూచనలు