వ్యవసాయ పంటలు

Cotton Cultivation Management Practices: పత్తి పంటలో సమగ్ర యాజమాన్య విధానాలను పాటిస్తే మేలు.!

2
Cotton Cultivation
Cotton Cultivation

Cotton Cultivation Management Practices: రైతులకు పత్తి ప్రధానమైన వాణిజ్య పంట. తక్కువ పెట్టుబడి ఖర్చుతోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నందున రైతులు ఈపంటపై ఆసక్తి చూపిస్తున్నారు. నెలరోజులు వర్షాలు కురిసినా బతికే మొండి పంటగా పత్తికి పెరుంది. ప్రత్తి సాగును లాభదాయకంగా మార్చడానికి అధిక సాంద్రత విధానం చుక్కానిగా ఉపయోగపడుతోంది. మొక్కల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా ఎకరాకు రెండు విత్తనసంచులు విత్తి 30 నుంచి 40శాతం దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని రైతన్నలు అంచనా వేస్తున్నారు. అయితే పత్తిపంటను పురుగులు, తెగుళ్లు అధికంగా ఆశించి మొక్కదశలోనే పంటను నాశనం చేసి, రైతులకు తీరని అన్యాయం చేకూరుస్తాయి.

పత్తిపంటను ఆశించే చీడపీడలు పేనుబంక, దీపపు పురుగు, ఆకుముడత తెగులు, ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ, నల్లమచ్చ తెగులు, పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగు, బూడిద తెగులు, కాయతొలుచు పురుగు, గొంగళి పురుగు, ఇలా రకరకాల చీడపీడలు మొక్క దశ నుంచి పంట చేతికొచ్చే వరకు పంటకు హాని కలిగిస్తాయి.కాబట్టి సమగ్ర సస్యరక్షణ, ఆధునిక పద్ధతులతో పత్తి పంటను సాగు చేసి, చీడపీడలను నివారిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

పత్తి పంట సాగులో చీడపీడల నివారణకు రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తిలో పూత, పిందె, కాయ తయారయ్యే దశలు నీటికి క్లిష్టమైన దశలు. ఈ దశలో బెట్ట వస్తే పూత, పిందె, కాయ రాలుతుంది. కావున నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. వార్షిక పంట మార్పిడిని విధిగా ఆచరించాలి. పత్తి పంట మధ్య వరుసలో అంతర పంటల (Inter Crop) ను సాగు చేయాలి. రసం పీల్చే పంటలను దారి మళ్లించడానికి ఇతర పంటలను సాగు చేయాలి. పత్తి పంటను ఆశించిన పురుగులు, తెగుళ్ల గురించి తెలుసుకుని వాటిపై నిఘా ఉంచి, పంటను రక్షించుకోవాలి. పంట ఏపుగా పెరగటానికి కలుపు మొక్కలను ఏరివేయాలి.

Also Read: Steps to Boost Grape Yie ld: ద్రాక్ష దిగుబడిని పెంచడానికి రైతులు అనుసరించాల్సిన మార్గాలు.!

Cotton Flower Dropping

Cotton Cultivation Management Practices

చీడపీడలు నివారణకు రసాయన మందులను తగిన మోతాదులో పిచికారి చేయాలి. రసాయన ఎరువుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. తెగుళ్లు ఆశించిన మొక్కలను పీకివేయాలి. పొలం ఎన్నిక దగ్గరి నుంచి పంట కోత వరకు చేసే అనేక పనులను పంట సస్యరక్షణ గా చెప్పవచ్చు. సాగు, యాంత్రిక, జీవ నియంత్ర ణ, రసాయన పద్ధతులు, కలుపు నివారణ, ఎలుకల నిర్మూలన తో పాటు చీడపీడలను నియంత్రిస్తే మంచి లాభాలు పొందవచ్చు.

పత్తిలో పంటలో చీడ-పీడల నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలి. ప్రస్తుత పరిస్థితులలో పత్తి పంటలో రసం పేనుబంక, పచ్చ దోమ, తామర పురుగులు మొదలగు రసం పీల్చు పురుగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు కాండానికి మందు పూత పద్ధతిని మోనోక్రోటోఫాస్‌, నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోరోప్రిడ్‌, నీరు లేదా ఫ్లోనికామిడ్‌, నీరు 1:20 నిష్పత్తిలో 30, 45, 60 రోజులలో ఉపయోగించి రసంపీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

తామర పురుగుల నివారణకు లీటర్‌ నీటికి 2 మి.లీ. ఫిప్రోనిల్‌ లేదా 0.2 గ్రా. థయోమిథాక్సమ్‌ లేదా 0.3 గ్రా. ఫ్లోనికామిడ్‌ మొదలగు వాటిని పిచికారీ చేసుకోవాలి. పత్తిని ఆశించే గులాబీరంగు పురుగు నివారణకు పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టల ద్వారా సరైన నిఘా పెట్టి, తొలి పూత దశ నుండి చేనులో కనిపించే గుడ్డి పూలను ఎప్పటికపుడు ఏరి నిర్ములిస్తూ ఆ పైన పురుగు తాకిడిని బట్టి మొదటి దశలో ప్రోఫినోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ అవసరం మేరకు పిచికారీ చేయాలి.

రసాయనిక పురుగు మందుల వల్ల చనిపోగా మిగిలిన సంతతి వృద్ధి చెందకుండా ఉండేందుకు సస్యరక్షణ చర్యలు దోహదపడతాయి. మధ్య మధ్య మందులతో పాటు వేప కాషాయం 5% లేదా వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే పంట పైచేయి సాధించి, తెల్లబంగారం పండించవచ్చు.

Also Read: Terrace Gardening: మిద్దె తోటల పెంపకంతో లాభాలు ఎన్నో.!

Leave Your Comments

Steps to Boost Grape Yield: ద్రాక్ష దిగుబడిని పెంచడానికి రైతులు అనుసరించాల్సిన మార్గాలు.!

Previous article

Leafy Vegetables Cultivation: సీజన్ తో సంబందం లేకుండా ఏడాది పొడువునా సాగు.!

Next article

You may also like