Chilli seed production : తెలుగు రాష్ట్రాల్లో మిరప ప్రధాన వాణిజ్య పంట. బీటీ పత్తి విస్తీర్ణం తగ్గు తుండటంతో మిరప విస్తీర్ణం పుంజుకుంటోంది. అయితే నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉండటం లేదు. దీంతో కల్తీ విత్తనాలు పెరుగుతు నేల: న్నాయి. దీనికితోడు వర్షాధారంగా సాగుచేస్తే హైబ్రిడ్ రకాల సంకర సామర్థ్యం అంతగా ఉండదు. ఇప్పటికే ప్రభుత్వాలు విడుదల చేసిన, వివిధ వాతావరణ మండలాల్లో పరీక్షించిన పలు సూటి మిరప రకాలు సాగులో ఉన్నాయి. వీటిలో రసంపీల్చే పురుగులను తట్టుకునేవి, నాణ్యమైన కాయలు, అధిక దిగుబడినిచ్చే రకాలున్నాయి.

Chilli seed production
రైతులు సూటి రకాలను సాగు చేసేట ప్పుడు కావలసిన రకాలను సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని సూటి రకాలలో విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేర్పాటు దూరం, కల్తీల ఏరివేత, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు నియంత్రణలో జాగ్రత్త వహిస్తే నాణ్యమైన విత్తనోత్పత్తి సుసాధ్యమే.
విత్తనోత్పత్తి: మిరప ఉష్ణ, ఉప ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతుంది. సముద్ర విత్తే స మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో సైతం పెరగగలదు. 20-25 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత మిరప ఉత్పత్తికి అనువైనది. మంచును తట్టుకోలేదు. ట్టేందుకు మధ్యస్త వర్షపాతం (60-120 సెం. మీ.) ఉండే వెచ్చని వాతావరణం మొక్క పెరుగుదలకు అనువుగా ఉంటుంది. పొడి వాతావరణం కాయ పక్వానికి రావ ప్రధాన టానికి ఉపయోగపడుతుంది. 17-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మొలక దుక్కి చేసి శాతం బాగుంటుంది. అధిక ఎండ తీవ్రతతో దిగుబడి పెరుగుతుంది. అయితే క్కలు వే ఘాటు (కాప్సైసిన్ పాళ్లు తగ్గుతుంది. కాయ రంగు సైతం తగ్గుతుంది. పూత అభివృద్ధి, కాయ ఏర్పడే దశలలో నేలలో తేమ తక్కువగా ఉంటే పూత, ఖాళీలను పిందె రాలుతుంది. కాయల పరిమాణం తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత 37.8డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉంటే కాయ అభివృద్ధి దారుణంగా పడిపోతుంది. అధిక రాత్రి ఉష్ణోగ్రతతో ఘాటుదనం పెరుగుతుంది.
సంపర్కం: రాత్రి 2 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య పూలు విచ్చుకుంటాయి. విచ్చుకున్న గంటకు పుప్పొడి రేణు వులు విడుదలవుతాయి. ఉదయం 8-10 గంటల మధ్య విడుదల గరిష్టంగా ఉంటుంది. పూత వచ్చిన మొదటిరోజు కీలాగ్రం సంసిద్ధత, పుప్పొడి రేణు వుల సామర్ధ్యం అధికంగా ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి పూలు విచ్చుకోవటం, పుప్పొడి రేణువుల విడుదల ఆధారపడి
Also Read: Pest Control in Chillies: మిరపలో తెగులు నియంత్రణ.!
వేర్పాటు దూరం: మిరప తరచుగా పరాగ సంపర్కం చెందే పంట. దీని కితోడు కూర మిరపతో కూడా సంపర్కం చెందుతుంది. కాబట్టి మిరపలోని రకాలతో పాటు, కూర మిరప రకాలకు దూరంగా విత్తనోత్పత్తి చేపట్టాలి.ఫౌండేషన్ విత్తనానికి 500 మీటర్లు, ధ్రువీకరణ విత్తనానికి 250 మీటర్ల న వేర్పాటు దూరం అవసరం.
నేలః కర్బన శాతం ఎక్కువగా ఉండి, మురుగునీరు పోయే సౌకర్యమున్న ఇసుక, రేగళ్లు, నల్లరేగడి నేలలు మిరప సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార నేలలు అనుకూలం కాదు.
ఎరువులు: దుక్కి తయారీ సమయంలో ఎకరాకు 8-10 క్వింటాళ్లు బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. సాధారణంగా 65 కిలోల నత్రజని, 30 కిలోల చొప్పున భాస్వరం, పొటాష్ పోషకాలనిచ్చే ఎరువులు వాడాలి. ఒక్క వంతు నత్రజని, సిఫార్సు మేర భాస్వరం, పొటాష్ లను చివరిగా పొలం తయారీ సమయంలో వేయాలి. మిగతా నత్రజనిని ప్రధాన పొలంలో మొక్కలు నాటిన 6 వారాల తర్వాత వేయాలి.

Using Fertilizers in Chilli
విత్తే సమయం: వర్షాకాలంలో జులై, ఆగస్టు, యాసంగి (రబీలో) అక్టోబరు నవంబరులో విత్తాలి. ఎకరాకు 400గ్రా. విత్తనం అవసరం. విత్తనోత్పత్తి చేప ట్టేందుకు భాగ్యలక్ష్మీ, ఆంధ్రజ్యోతి, సింధూర్, కిరణ్, అపర్ణ, భాస్కర్, ప్రకాశ్ ఇతర సూటి రకాలు అనువైనవి.
ప్రధాన పొలంలో నాటడం: 5-6 వారాల వయసున్న నారును. బాగా జలక దుక్కి చేసిన ప్రధాన పొలంలో 60-45 సెం.మీ. దూరంలో నాటాలి. నారుమ యితే క్కలు సేకరించే ముందే నారుమడిని తడపాలి. సాయంత్రం వేళల్లో నాటాలి వెంటనే తేలికపాటి తడివ్వాలి. ప్రధాన పొలంలో నాటిన 4, 5 రోజుల తర్వాత వాత, ఖాళీలను పూరించాలి. రెండోతడి ఇవ్వాలి. మిరప వేర్లు భూమి పైపొరల్లో ఉంటాయి. కాబట్టి తక్కువ వ్యవధుల్లో నీటి తడులివ్వాలి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Prevention of Rot in Chilli : మిరపలో నారు కుళ్ళు తెగులు నివారణ.!
Must Watch: