Asparagus Cultivation: ఇది బహువార్షిక పొద, వీటి కొమ్మలు పొడవుగా, నాజుకుగా తీగలాగా పెరుగుతాయి. సన్నని సూదిలాంటి ఆకుపచ్చని ఆకులతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కొమ్మలను కట్ ఫ్లవర్స్‌తో పాటు అలంకరణ కొరకు ఎక్కువగా వినియోగిస్తారు. ఆస్పరాగస్ ప్లుమొసన్ ఆకులు వెడల్పుగా, నాజుకుగా తీగపై అమరి ఉంటాయి.
వాతావరణము, నేలలు: ఇవి సూర్యరశ్మి బాగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. చలికాలంలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. లోతైన ఎర్ర గరప నేలలు అనుకూలo.
ప్రవర్ధనం: విత్తనం ద్వారా లేదా మొక్కలను విభజించి (వేరు చేసి) నాటవచ్చు. నేలని బాగా దున్ని 90 సెం.మీ. వెడల్పు, 30 సెం.మీ. ఎత్తుగల బెడ్లను తయారు చేయాలి. బెడ్ల తయారీకీ 2 వంతుల ఎర్రమట్టి, 1 వంతు పశువుల ఎరువును వాడవచ్చు. రెండు బెడ్ల మధ్య 40 సెం.మీ. దారులు వదలాలి.
ప్రతి చదరపు మీటరుకు 5 కె.జి ల పశువుల ఎరువు వేసి మొక్కలను 45×45 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. నాటిన 6 నెలలకు మరొక్కసారి – 5. కిలోల పశువుల ఎరువు లేదా 500 గ్రా॥ వర్మీ కంపోస్టు వేయాలి. నాటిన 3వ నెలనుండి కొమ్మలను పొడవైన కాడతో భూమికి దగ్గరగా కత్తిరించి మార్కెట్టుకు పంపవచ్చు. ప్రతినెలకు ఒకసారి కొమ్మలను కత్తిరించవచ్చు. ఎండిన కొమ్మలను తీసి ఎరువును వేసినచో ఎక్కువ సంఖ్యలో పిలకల ఉత్పత్తి జరుగుతుంది.
Also Read: Dairy Works: డైరీలో ప్రతి రోజు చేయవల్సిన పనులు.!

Asparagus Cultivation
నీటి పారుదల: ఆస్పరాగస్కి చలికాలంలో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది.
సస్యరక్షణ: ఫ్యూజేరియం, ఎండుతెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించి పిలకల ఉత్పత్తి తగ్గుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఎండిపోతాయి. ఈ మొక్కలను వేర్లతో సహా సమూలముగా నాశనం చేయాలి. కార్బండిజమ్ (1 గ్రా/లీటర్ నీటికి) కలిపి ఈ తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.
కోత: నాటిన మొదటి సంవత్సరంలో 1 చదరపు మీటరుకి 300 కొమ్మలను కోయవచ్చు. కొమ్మలు త్వరగా పొడవుగా పెరుగుటకు నీటిలో కరిగే పోషకాలనిస్తూ పైపాటిగా జిబ్బర్లిక్ ఆమ్మం 1 గ్రా/లీటరు నీటికి (1000 పిపియం. ) కలిపి పిచికారి చేసినచో కొమ్మలు పెరుగుతాయి.
Also Read: Watershed Facts: నీటి పరీవాహక ప్రాంతం గురించి ముఖ్య విషయాలు తెలుసుకోండి.!