ఆంధ్రప్రదేశ్తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

0
చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు చాల తక్కువగా ఉంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రతవల్ల  వరి నారుమళ్లలో పెరుగుదల సరిగా ఉండదు. నారు ఎర్రబారి, ఎండిపోతుంటుంది. అందువల్ల యాసంగి వరినార్లు పెంచే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలను మండెకట్టి దమ్ముచేసిన పొలంలో నారుమళ్లు పోసుకోవాలి. నారుమడికి సూచించిన నత్రజని, పోటాష్ ఎరువులతో పాటు రెండు గుంటల నారుమడికి మాగిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మికంపోస్టును  రెండు క్వింటాళ్ల చొప్పున వేసి కలియ దున్నాలి. భాస్వరాన్ని రెట్టింపు మోతాదులో నారుమడి దమ్ములోనే వేయాలి. నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసేటప్పుడు ఒక కిలో యూరియాకి 2 గ్రా. కార్బెండాజిమ్ 25 శాతం + మాంకోజెబ్ 50 శాతం డబ్ల్యు.ఎస్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. యాసంగిలో సీజన్లో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి గనుక నారుమళ్లపై జింక్ సల్ఫేట్ పిచికారి చేసి సవరించాలి. చలి సమస్యను అధిగమించడానికి నారుమళ్ల పైన ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలను పాతి వాటి పైన పలుచని పాలిథీన్ షీట్ గాని, ఖాళీ ఎరువుల సంచులతో తయారు చేసిన పట్టాలను గాని కప్పాలి. ఈ పాలిథీన్ షీట్ లేదా గోనె పట్టాలను సాయంత్రం వేళల్లో నారుమళ్లపై కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. అలాగే నారుమళ్లకు   రాత్రి వేళల్లో నీరు నిండుగా పెట్టి తెల్లవారు జామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి. సూచించిన ఈ జాగ్రత్తలను పాటిస్తే చలి ప్రభావాన్ని తట్టుకొని వరినారు ఏపుగా, ఆరోగ్యాంగా పెరుగుతుంది.
Leave Your Comments

దున్నకుండా మొక్కజొన్న సాగు…

Previous article

మామిడి పూత దశలో ఈ జాగ్రత్తలు తీసుకోండి !

Next article

You may also like