Agriculture Works in Rain Season: వానాకాలం పంటల సాగుకు ముందు ఈ క్రింద తెల్పిన విధంగా వ్యవసాయ పనులు చేయడం ద్వారా పంట సాగు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
భూసార పరీక్ష చేయించడం :
భూసార పరీక్ష చేయుటకు ఇప్పుడు అనువైన సమయం. సరైన పద్ధతిలో మట్టిని సేకరించి దగ్గరగా ఉన్న మట్టి పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించి భూమిలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చు. దీని ద్వారా పంటకు కావల్సిన పోషకాలను తగిన మోతాదులో అందించి ఎరువుల పెట్టబడి ఖర్చులు తగ్గించవచ్చు.
వేసవి దుక్కులు దున్నుట :
వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన కలుపు విత్తనాలు, చీడపీడల కోశస్థ దశలు బయటపడి ఎండవేడికి నశిస్తాయి. ఈ విధంగా బైటపడిన కోశస్థ పురుగులు పక్షులకు ఆహారంగా మారుతాయి. అదేవిధంగా నీరు నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నేలకోత గురికాకుండా ఉంటుంది. నేలక్షారత్వం క్రమేణా తగ్గుతుంది.
పచ్చిరొట్ట విత్తనాలు సేకరించుట :
పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, అలసంద, పిల్లిపెసర వంటి విత్తనాలను తొలకరి వర్షాకాలకు విత్తుకుని పైరు పూత దశలో ఉన్నప్పుడు నేలలో కలియదున్నాలి. దీని ద్వారా తగినంత సేంద్రియ పదార్థాన్ని అందించడానికి పచ్చిరొట్ట బాగా పనికి వస్తుంది.
పంట విత్తనాలు సేకరణ :
వానాకాలం సాగుకు ముందు మేలైన విత్తనాలను సేకరించుకుని వర్షాలు పడగానే సరైన తేమలో విత్తనాలను విత్తుకోవాలి.
Also Read: Methods of Raising Rice Seedlings: వరి నారుమడులు పెంచుకునే పద్ధతులు – చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

Agriculture Works in Rain Season
గొర్రెల మంద పెట్టడం :
నేల సారం పెంచడానికి పంట పొలాల్లో గొర్రెలు మరియు మేకలను మందగా ఉంచాలి. ఈ విధంగా గొర్రెలు మరియు మేకలను మందగా పెట్టడం ద్వారా భూసారం పెరుగుతుంది.
సేంద్రియ ఎరువులు సమకూర్చుట :
సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మికంపోస్టు, కోళ్ళఎరువు, గొర్రెల ఎరువులు నేలలో తగిన మోతాదులో వేయడం ద్వారా భూసారం పెంచవచ్చు.
వాతావరణ సూచనల ఆధారంగా పంటల సాగు :
ఎర్రనేలల్లో వర్షాధారంగా పండిరచే పంటలను 50 మి.లీ. మరియు నల్ల రేగడి భూముల్లో 60 మి.లీ. వర్షం పడిన తర్వాత నేలలో పంటలను విత్తుకోవాలి.
పంటల సాగుకై సమాచారం సేకరణ :
పంటల యొక్క పూర్తి సాగు విధానాలను, సమాచారాలను తెల్సుకోవడానికి వ్యవసాయ అనుబంద మ్యాగజైన్లు, వ్యవసాయ పంచంగం, వ్యవసాయ వెబ్సైట్ల నుండి సమాచారాన్ని సేకరించాలి.
Also Read: Dal Lake Weeds to Organic Manure: సేంద్రియ ఎరువుగా దాల్ సరస్సు కలుపు మొక్కలు.!