Cauliflower Cultivation: పువ్వు గోబీ చాలా సున్నితం అయినా పంట దీని యందు విటమిన్ – ఎ, విటమిన్ సి, భాస్వరం, కాల్షియం , మెగ్నీషియం, సోడియం, ఇనుము మరియు పిండి పదార్ధం సమృద్ధి గా ఉండును.ప్రధాన కాండ అంతం అయ్యే చోట విభజించబడిన సముదాయం curd అంటారు.దీనిలో తినుటకు ఉపయోగ పడే భాగం curd.
వాతావరణం :
ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం.చల్లగా ఉన్న కొండ ప్రాంతాలలో వేసవిలో కూడా ఈ పంటను పండించవచ్చు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్న పూగోబీ నాణ్యత తగ్గును.అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలికే రకాలు అయినా ఎర్లిస్నోబాల్, పూస వంటి రకాలను సాగు చేయవచ్చు.
నేలలు :
సారవంతమైన బాగా నీరు ఇంకు గరప నేలలు పంట సాగుకు అనుకూలం.ఆమ్లా లక్షణములు కలిగి మురుగు నీరు పారుదల లేని నేలలు దీని సాగుకు పనికి రావు.
రకాలు :
క్యాలిఫ్లవర్ పెరుగుదల ఉష్ణోగ్రత మరియు కాంతి సమయం పై ఆధారపడి ఉంటాయి.కావున సరైన సమయానికి సరైన రకం ఎన్నుకోవడం చాలా ముఖ్యం.సాధారణంగా స్వల్ప కాలిక రకాలు చిన్నావిగా పసుపు రంగు గల పూగోబీ, మధ్యస్థ రకాలు పెద్ద పూగోబీ మాములు తెలుపు రంగులో మరియు దీర్ఘ కాలిక రకాలు దిట్టంగా పాల తెలుపు గల పూ గోబీ ను ఇస్తాయి.
విత్తు కాలము :
స్వల్ప కాలిక రకాలు -జులై -ఆగష్టు
మధ్య కాలిక రకాలు -ఆగష్టు -సెప్టెంబర్
దీర్ఘ కాలిక రకాలు -సెప్టెంబర్ – అక్టోబర్
Also Read: Cauliflower Physical Defects: క్యాలిఫ్లవర్ లో భౌతిక లోపాలు – వాటి నివారణ.!
విత్తన మోతదు :
స్వల్ప కాలిక రకాలు – 600-700 గ్రా. హె
దీర్ఘ కాలిక రకాలు -350-400 గ్రా. హె.
విత్తనము సన్నని ఇసుకతో కలిపి నారు మడి పోసి 30-35 రోజుల తర్వాత నాటుకోవాలి.
విత్తే దూరము :
స్వల్ప కాలిక రకాలు -45×45సేం. మీ
దీర్ఘ, మధ్య,కాలిక రకాలు -60×45 సేం. మీ
ఎరువులు :
హేక్టర్ కు సుమారు 40-50 కేజీల భాస్వరం,50 కిలోల పోటాష్ ఎరువు ఆఖరి దుక్కిలో వేయాలి.తర్వాత హెక్టరుకు 60-80 కిలోల నత్రజని 3 సమాన భాగాలుగా చేసి తోలి సారి నారు నాటిన 25-30 రోజులకు, రెండోవ సారి 50-60 రోజులకు మూడోవా సారి 75-80 రోజులకు వేయాలి.
అంతర కృషి నీరు కట్టుట :
క్యాలి ఫ్లవర్ పెరుగుదలకు నీరు ఎంతైన అవసరం.భూమిలో తేమను బట్టి వారానికి ఒక్కసారి అయినా నీరు పెట్టాలి.నాట్లు వేసిన 15 రోజులలో మొక్కలు బాగా నాటుకుంటాయి.ఆ తర్వాత కలుపు తీసి మట్టిని ఎగ త్రోయడం చేయాలి.
బ్లాంచింగ్ :
పూ గోబీ తెల్లగా ఉండాలి అంటే పెరుగుతున్న పువ్వులోనికి సూర్య రశ్మి చేరకుండా జాగ్రత్త పడాలి.దీనికి గాను పువ్వు చుట్టు ఉన్న ఆకులలో చివరి వరుస ఆకులను కప్పుతూ లేదా రబ్బరు బాండ్ తో కట్టాలి.
కోత :
పువ్వు సరైన పరిమాణం అయినా తర్వాత కోయాలి.పువ్వును కోసేటప్పుడు 2-3 ఆకులు కోయడం వలన రవాణాలో ఇవి పువ్వుకు రక్షణ గా ఉంటాయి.పూ గోబీని గది ఉష్ణోగ్రత దాదాపు 4-5 రోజులు నిల్వ చేయవచ్చు.
దిగుబడి :
సరైన విధానం గా సాగు చేసిన హెక్టర్ కి దాదాపు 20 టన్నుల పూ గోబీ దిగుబడి పొందవచ్చు.
Also Read: Cabbage And Cauliflower: క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ పంటలలో జాగ్రత్తలు