జాతీయంవార్తలు

Farmers’ Hopes on the Union Budget: 2022-23 కేంద్ర బడ్జెట్ పై రైతుల ఆశలు

1
Farmers Expect Good news From Union Budget 2022-23

Farmers’ Hopes on the Union Budget: రాబోయే కేంద్ర బడ్జెట్ 2022-23లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయంలో వెనుకబడిన రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. అందులో భాగంగా పెట్టుబడులకు చేయూత అందించనుంది. కేంద్రం నుంచి వస్తున్న సమాచారాల ప్రకారం రైతులు ఏ విధంగా లబ్ది పొందనున్నారు అన్న ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా సమాచారం ప్రకారం పంట ఎగుమతికి ప్రోత్సాహకం, ఉత్పత్తుల కోసం అవుట్‌లెట్‌లను ఏర్పాటు. మార్కెటింగ్, అదనపు రవాణా మరియు బ్రాండింగ్ ప్రోత్సాహకాలను ఈ రంగానికి ప్రభుత్వం సాయం అందిస్తుంది.

Finance Minister Nirmala Sita Raman

Finance Minister Nirmala Sita Raman

ఇక కోఆపరేటివ్ సెక్టార్‌ను బలోపేతం చేసేందుకు కొత్త ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరుగుందన్న సమాచారం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.10900 కోట్ల ప్రోత్సాహకాలను కూడా ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను ప్రకటిస్తే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు ఉండనున్నట్లు తెలుస్తుంది.

Also Read: రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…

 Farmers' Hopes on the Union Budget

Farmers’ Hopes on the Union Budget

కాగా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యవసాయ రసాయనాలపై GSTని తగ్గించాలన్న ప్రతిపాదనలు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న GST 18% నుండి 6% వరకు తగ్గించాలన్న ప్రతిపాదనలు కేంద్రం ముందున్నాయి. అదేవిధంగా స్థానిక ఉత్పత్తిదారులను మరింత పోటీగా మార్చేందుకు తుది ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడం మరియు ఎగుమతి ఆధారిత దేశీయ తయారీదారులకు భారతీయ వ్యవసాయ మార్కెట్‌లో బూమ్ తీసుకురావడం కోసం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించడం ఈ సమయంలో చాలా అవసరం. ఇక వెనుకబడిన తయారీదారులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందించాలి.

Also Read: ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత…

Leave Your Comments

Grow Plants Without Soil: మట్టి లేకుండా మొక్కలను పెంచే విధానం

Previous article

Techniques in Niger Cultivation: నైజర్ సాగులో మెళుకువలు

Next article

You may also like