Benefits of Cow Dung: పంట భూములను సారవంతం చేయాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడటమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి మెరుగుపరచిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి.
ఉపయోగాలు:
- రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారమయ్యాయి. తిరిగి సారవంతం చేయడం ఆవు పేడ, మూత్రంతోనే సాధ్యం.
- వ్యవసాయానికి దిబ్బ ఎరువు, పంచగవ్య, బీజామృతం, జీవా మృతం, అమృత్‌పానీ తయారీలో ఆవు పేడ వాడకం తప్పనిసరి.
- పంచగవ్యను మనుషులకూ ఔషధంగా వాడుతున్నారు.
- కిలో పేడతో ‘నాడెప్’ పద్ధతిలో 20 కిలోల ఎరువును చేయొచ్చు.
Also Read: పాడి పశువుల ఎంపికలో మెళుకువలు
- సేంద్రియ పురుగుమందులతోపాటు సౌందర్య సాధనాలు, కాగితం, దోమల కాయిల్స్, ధూప్ స్టిక్స్ తయారీలో ఉపయోగ పడుతోంది.
- గ్రామస్థాయిలో గోబర్ గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసు కోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పేడ ప్రయోజనాలు ఇంకెన్నో..
మెట్ట ప్రాంతాల ఆవుల పేడ శ్రేష్టం
సాధారణంగా పశువుల పేడలో నత్రజని 3%, ఫాస్ఫరస్ 2%, పొటాషియం 1% ఉంటాయి. అయితే, జంతువును బట్టి, జాతిని బట్టి, మేతను బట్టి పేడలో పోషకాల శాతం మారుతుంటుంది. మెట్ట ప్రాంతాల్లో గడ్డి మేసే ఆవుల పేడలో అన్ని రకాల (స్థూల, సూక్ష్మ) పోషకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి.
ప్రాణ రక్షక ఔషధం పేడ!
పేడ సజీవమైన ఎరువు. మట్టిలోని జీవులకు పేడ ప్రాణ రక్షక ఔషధం వంటింది. భూసారాన్ని పెంపొందించడంలో పేడ పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ, తండ్రులు, తాతల నాటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలో చాలా వరకు వదిలేశాం.
కర్నాటక, మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఇప్పటికీ పట్టుదలగా సేంద్రియ సాగు కొనసాగిస్తున్నారు. పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం, బీజామృతం వంటి వాటిల్లో పేడను విరివిగా వాడుతున్నారు.
Also Read: ఈ ఆవుల్లో అధిక పాల ధిగుబడి కోసం ఇలా ఫాలో అవ్వండి.!