Mushroom Cultivation: పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.
జాగ్రత్తలు:
- 16 చదరపు అడుగుల ఒక పూరి పాక లేదా షెడ్ అవసరం. దాన్ని విత్తు విత్తడానికి ఒక గది, పెంపకానికో గది ఉండేలా విభజించుకోవాలి.
- విత్తడానికి వాడే గదిలో 25 నుంచి 300 సె ఈ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చక్కని గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.
- పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250 సె ఉష్ణోగ్రత ఉండేలా, గాలిలో 75 – 80% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత, తేమలను కొలిచే డిజిటల్ థర్మామీటర్లు, హ్యుమిడిటీ మీటర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. స్పాన్(పుట్టగొడగులను విత్తడం)
Also Read: పుట్టగొడుగులలో వచ్చే ఈగల వ్యాధులు, వాటి నివారణ చర్యలు
- సరైన ఆధారం : సజ్జ/ ముడిశనగలు / జొన్న, గోధుమ ధాన్యాలు
- స్పాన్ తయారుచేయడం : సగం ఉడకబెట్టిన ధాన్యాలు గాలికి ఎండబెట్టి, 2 శాతం కాల్షియం కార్బొనేట్ పొడితో కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ గ్లూకోజు డ్రిప్ బాటిళ్లలో నింపాలి. వాటిని పత్తితో మూతి బిగించి 2గంటలసేపు ఉడకబెట్టాలి.
- వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి లేదా వ్యవసాయ శాఖలనుంచి పరిశుద్ధమైన శిలీంధ్రాన్ని తెచ్చి గది ఉష్ణోగ్రతకు దగ్గర 15 రోజులు పొదగనివ్వాలి. ఈ 15-18 రోజుల స్పాన్ను ఉపయోగించి విత్తాలి పుట్టగొడగుల పాదును ఏర్పాటు చేయడం
- సరైన ఆధారం : వరి గడ్డి / గోధుమ గడ్డి, చెరకు పిప్పి, పైపొట్టుతీసిన మొక్కజొన్న
- ఉడకబెట్టడం : 5సెం.మీల ముక్కలుగా వాటిని కత్తిరించి నీటిలో 5గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని ఒక గంటసేపు వేడిచేయాలి. ఆ తర్వాత నీటిని వొంపి, 65 శాతం తేమ మాత్రమే ఉండేలా ఆరబెట్టాలి(చేతులతో నీటిని పిండకూడదు).
Also Read: పుట్ట గొడుగులు – పోషకాల గనులు
Leave Your Comments