Sandalwood Cultivation: శ్రీ గంధము (చందనము) గా నామం కలిగిన ఈ మొక్క సాంటాలేసి కుటుంబానికి చెందినాది. శ్రీ గంధము మొక్క 4మీ. నుండి 9మీ. ఎత్తు పెరిగే సతత హరిత వృక్షం. పండ్లు లోపల గట్టి విత్తనంతో, బయట పలుచని గుజ్జుతో ఉంటాయి.పండిన పండ్లు ఊదా రంగులో ఉంటాయి. లోపల ఒక గింజ ఉంటుంది.

Sandalwood Cultivation
ఇసుక, ఎర్రమట్టిలను 3:1 నిష్పత్తిలో నీడ్ బెడ్ తయారు చేసి, నిమాటిసైడ్ (ఏరలక్స్ లేదా తిమ్మెట్ 500 గ్రా. 10 మీ.X 1మీ. బెడ్ కు) కలపాలి. పరిపక్వత చెందిన శ్రీ గంధము విత్తనములు సేకరించి, 10మీ.X1మీ. నారుమడికి 2.5 కిలోల విత్తనాన్ని సమానంగా పరచాలి, దానిపై ఎండు గడ్డిని పలచగా పరచాలి. మెలకలు కనిపించగానే గడ్డిని తొలగించాలి. విత్తనాలను 0.05% గిబ్బర్లిక్ ఆసిడ్ లో రాత్రి నానబెట్టినచో మొలకలు అధికముగా వచ్చును. శిలీంద్రాల వల్ల, నిమాటోడ్ వల్ల శ్రీ గంధమునుకు తీవ్రమయిన తెగులు సోకుతుంది.

Sri Gandham Plants
Also Read: నిమ్మ గడ్డి సాగులో మెళుకువలు.!
పాలిథీన్ సంచులను, 2:1:1 నిష్పత్తిలో ఇసుక, ఎర్రమట్టి, మాగిన ఎరువులను నింపాలి. నారు మెక్కలు 4 నుండి 6 ఆకుల దశకు చేరుకోగానే పాలిథీన్ సంచులలో నాటుకోవాలి. శ్రీ గంధము బాగా పెరగడానికి కంది మొక్క బాగా దోహదపడుతుంది. శ్రీ గంధము వేర్లకు హాని కలగకుండా నారు మొక్కలను జాగ్రత్తగా నారుమళ్ళ నుండి తీయాలి. వేర్లను తడార నీయరాదు. మొక్కలు నాటిన తరువాత వారము రోజులు నీడలో ఉంచాలి, రోజుకొక సారి నీరు పట్టాలి. కాని అధికంగా ఉండకుండా చూడాలి. కంది మొక్కలు చందనము మొక్కల కంటే ఎక్కువ పెరిగిన, చందనము మొక్కల పెరుగుదలకు హాని కలుగుతుంది.
నాట్లకు అవసరమయిన 30 సెం.మీ. ఎత్తుగల మొక్కలు 6-8 నెలల్లో తయారవుతాయి. వీటిని వచ్చే వర్షాకాలంలో పొలములో నాటుకొన వచ్చును.
Also Read: తెలంగాణలో చామంతి సాగు విధానం