వ్యవసాయ వాణిజ్యం

Success Story: ముగ్గురు అక్కాచెల్లెళ్లు – నెలకు 25 లక్షల సంపాదన

1
Kerala Three Sisters Life Success Story

Success Story: వంటకం ఘుమఘుమలాడాలంటే ఆ వంటలో చెంచాడు ఇంగువ చేర్చితే సరి. భారతీయ వంటకాల్లో ముఖ్యమైన మసాలా దినుసుల్లో ఇంగువ ఒకటి. ప్రస్తుతం అందరి కిచెన్ రూంలో ఇంగువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల వంటకాల్లో ఇంగువను విరివిగా వాడుతున్నారు. ఇది ఏ వంటకంలో వేసిన రుచికరమైన ఆహారంతో పాటు మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అందుకే ఇంగువకి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాగా ఇంగువ సాధారణంగా అటవీ ప్రాంతాలలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రతల్లోనే పెరుగుతుంది. అందువలన ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలలో దీనిని పెంచడం కష్టం. అయితే ముగ్గురు అక్కచెల్లెళ్లు మాత్రం ఇంగువ వ్యాపారంలోకి దిగి ఉహించని రీతిలో సక్సెస్ సాధించారు.

kerala Sisters

ప్రస్తుత రోజుల్లో ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు రాని పరిస్థితి. ఉన్నత చదువులు చదివి దానికి తగ్గ హోదాలేని ఉద్యోగాలు చేయలేక ఆందోళన చెందుతున్నారు. కానీ ముగ్గురు అక్కచెల్లెళ్లు మాత్రం వినూత్నంగా ఆలోచించి సక్సెస్ అయ్యారు. ఎంబీయే చేసిన వర్షా ప్రశాంత్‌ మూడేళ్ల క్రితం ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. అందుకు ఆమె ఇద్దరు చెల్లెళ్ళు విస్మయ, వ్రిందా తోడుగా నిలిచారు. 3వీస్‌ పేరుతో 2 లక్షలు వెచ్చించి సంస్థను ప్రారంభించి ఇంగువను మార్కెట్‌ చేయడం మొదలుపెట్టారు. వర్ష సంస్థ కార్యకలాపాలను చూస్తుండగా.. , చార్టర్డ్‌ అకౌంటెంట్‌ విద్యార్థి విస్మయ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తుంది. బిబిఎ పూర్తయిన వ్రిందా డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. విశేషం ఏంటంటే వీరి తల్లిదండ్రులు సరళ, ప్రశాంత్ లు కూడా 3వీస్ కంపెనీలో పనిచేస్తున్నారు.

Also Read: టెక్కీ టూ అభినవ్ కిసాన్ పురస్కారం.. సక్సెస్ స్టోరీ

ఇంగువను తయారు చేసేందుకు వాళ్ళు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుండి ముడి పదార్ధాలను దిగుమతి చేసుకుంటారు. దీనికి డీలర్లను నియమించుకున్నారు. ప్రస్తుతం 3వీస్ కంపెనీలో 30 మంది ఎంప్లాయిస్ ఉన్నట్లు వర్ష తెలిపారు. తమ ప్రొడక్ట్స్ ని విదేశాల్లో కూడా విస్తరించాలని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం 3వీస్ సంస్థలో పసుపు, కారం, కొత్తిమీర, సాంబార్, మిరియాలు, చికెన్‌.. మసాలాలను అమ్ముతున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు నెలలుగా పాతిక లక్షల మార్జిన్‌ను చేరుకున్నామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టగా ఉన్న వర్ష చెప్తుంది. అదికాక వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా మంచి విక్రయాలు జరుగుతున్నాయి అని డిజిటల్‌ మార్కెటింగ్‌ చూసే వ్రిందా తెలిపారు. మొదట అద్దె ఇంటిలోని చిన్న గదిలో ప్రారంభించి ఇప్పుడు రూ.50 లక్షల విలువైన యంత్ర సామగ్రితో నడుస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. .

అయితే సంస్థ ఏర్పాటుకు ముందు ఉత్పత్తికి సంబంధించి అగ్రోపార్క్ వద్ద శిక్షణ పొందారు. శిక్షణలో మార్కెటింగ్, డిమాండ్ అండ్ సప్లయ్ గురించి అనేక మెళుకువలు నేర్చుకున్నారు. శిక్షణ అనంతరం తమిళనాడులోని కొన్ని తయారీ యూనిట్లను సందర్శించి పూర్తిగా పట్టు సాధించారు.ప్రస్తుతం ముగ్గురు అక్కచెల్లెళ్లు అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు.

Also Read: జామ సాగు – రైతు విజయగాధ

Leave Your Comments

Rainwater Harvesting: వాన నీటి సంరక్షణలో కందకాల ప్రాముఖ్యత.!

Previous article

Chicken Breeds: కోళ్ల జాతులు మరియు వాటి ప్రత్యేకత

Next article

You may also like