వ్యవసాయ వాణిజ్యం

Ozone Pollution Harms: ఓజోన్ కాలుష్యంతో పంటలకు తీవ్రమైన హాని

0
Ozone Pollution Harms

Ozone Pollution Harms: శిలాజ ఇంధన కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేయడం ద్వారా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా గాలి నాణ్యతను మరింత దిగజారుస్తున్నాయి. తూర్పు ఆసియాలో దాదాపు 63 బిలియన్ల పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం అధిక స్థాయిలో ఓజోన్ కాలుష్యంతో, చైనా, దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాల్లో గోధుమలు, వరి మరియు మొక్కజొన్నలలో దిగుబడి తగ్గిపోతున్నాయి. ఓజోన్ దెబ్బతినడం కారణంగా మొక్కల పెరుగుదలకు అంతరాయం కలిగించడంతో చైనాలో ఉత్పత్తి అవుతున్న గోధుమ, బియ్యం దిగుబడి కోల్పోతోంది.

Fossil fuel emissions

Fossil fuel emissions

శిలాజ ఇంధనాల దహనం ద్వారా విడుదలయ్యే నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు అస్థిర కర్బన సమ్మేళనాలు విడుదలవుతాయి. ఓజోన్ దెబ్బతినడంతో మనుషులు, మొక్కలు, జంతువులకు హాని కలిగిస్తుంది. ఓజోన్ చైనాలో మూడు పంటలకు ఆహార భద్రతను నేరుగా దెబ్బతీస్తుంది. Ozone Pollution Harms ఇప్పటికే భూమి నాణ్యత క్షీణించడంపై ఆందోళన చెందుతున్న చైనాకు ఇది ఆందోళన కలిగిస్తోంది. చైనా తన వ్యవసాయ భూమిలో కేవలం 7 శాతంతో ప్రపంచ జనాభాలో ఐదవ వంతుకు ఆహారం అందించాలి. పరిశ్రమలు, ఇంధనం మరియు పట్టణ విస్తరణ పరిమిత భూ వనరుల కోసం పోటీ పడుతున్నందున, చైనా 2009 నుండి 2019 వరకు దాని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 6 శాతం లేదా 7.5 మిలియన్ హెక్టార్లను కోల్పోయింది.

Also Read: భారతదేశంలోని టాప్ అగ్రికల్చర్ ఉత్పత్తి కంపెనీలు 2022

Ozone Pollution Impacts

Ozone Pollution Impacts

గత రెండు దశాబ్దాలుగా అమెరికా మరియు ఐరోపాలో కఠినమైన గాలి నాణ్యత చర్యలను ప్రవేశపెట్టడంతో ఓజోన్ కాలుష్య స్థాయిలు క్షీణించాయి. కానీ ఆసియాలో కాలుష్య కారకాలు పెరుగుతున్నాయి. ఓజోన్ కాలుష్యానికి దోహదపడే వాయువులు ఎక్కువగా నగరాల నుండి విడుదలవుతుండగా ఓజోన్ కాలుష్యం గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం దారుణంగా ఉంది. ఓజోన్ స్థాయిలను తగ్గించడానికి శిలాజ ఇంధనాల వాడకాన్ని అరికట్టడమే ఉత్తమ మార్గం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Also Read: భారతదేశంలో అత్యంత లాభదాయకమైన పంటలు

Leave Your Comments

Green Farming: హరిత వ్యవసాయం దిశగా శ్రీలంక

Previous article

Organic Farming: 10వ తరగతి డ్రాపౌట్ కానీ పద్మశ్రీ !

Next article

You may also like