Crab Farming: రొయ్యల పెంపకములో మాదిరిగా పీతల పెంపకంలో నేరుగా విత్తనమును హేచరీల నుండి తీసుకు వచ్చి చెరువులో వేసుకొని పెంపకము చేపట్టలేము. హేచరీల నుండి తీసుకువచ్చే పీత పిల్లలు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక వీటిని తప్పుని సరిగా నర్సరీలలో చేపట్టాలి.
పీతల పెంపకములో నర్సరీ పెంపకము మరియు యాజమాన్యము చాలా కీలకమైనది. రొయ్యలలో బ్రీడింగ్ ద్వారా 90 శాతం పోస్టులార్వా ‘బ్రతుకుదల సాధించవచ్చు. కానీ, పీతపిల్ల(ఇన్‌స్టార్)ల ‘బ్రతుకుదల కేవలం 5 శాతం వరకు మాత్రమే ఉంటుంది. అందువలన రైతులకు కావలసిన స్టాకు సైజు పీతలు సరిపడినంతగా కావాలంటే తప్పనిసరిగా రైతులు నర్సరీ యాజమాన్యములో సాంకేతిక మెళకువలు పాటించవలసి ఉంటుంది.
ప్రస్తుతం పీతల రైతులు, పెంపకం కోసం 100 – 200 గ్రాముల బరువుగల పీతలను ఇతర రాష్ట్రాల నుండి కేజి ఒక్కింటికి 400 – 550 రూపాయల చొప్పున కొంటున్నారు. దీని వలన ఖర్చు అధికమవుతుంది. అందువలన సీడు ఖరీదును తగ్గించుకొని తగినంత సీడును పెంపకమునకు ఉత్పత్తి చేసుకోవాలంటే హేచరీల నుండి తీసుకున్నటువంటి చిరు పీత పిల్లలను (ఇన్‌స్టార్ లను) నర్సరీలలో పెంపకం చేపట్టాలి. నర్సరీల యాజమాన్యము క్రింది విధంగా చేయాలి.
Also Read: చేపల పెంపకాన్ని మొదలు పెట్టే ముందు వీటిని ఒక్కసారి గమనించండి.!
నర్సరీ దశలో హేచరీ నుండి విడుదల చేసిన మెగలోపా లార్వా లేదా ఇన్‌స్ట్రార్‌లకు 2.5 సెం.మీ. కేరాపేసు వెడల్పు వరకు పెంచుతారు. సహజంగా ఇన్‌స్టార్‌లు 0.8 నుండి 0.5 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. వీటిని 80 – 40 రోజుల వ్యవధిలో మంచి యాజమాన్యము ద్వారా 2.5 సెం.మీ. పరిమాణం వరకు సాధించవచ్చు. వీటిని క్రాబ్‌లెట్స్ అని లేదా అగ్గిపెట్టె సైజు అని అంటారు. ఇవి 10 నుండి 15 గ్రాముల వరకు బరువుంటాయి. వీటిని (ప్రత్యక్షంగా పెంపకము చెరువులలో వేసుకొని సాగు వ. లేదా వేరొక చెరువులో మరో రెండు నెలలు పెంచి 70 నుండి 100 గ్రాములు పెరిగిన తరువాత పెంపకము చెరువులోకి మార్చుకోవచ్చును.
Also Read: మంచి నీటి చేపల చెరువులో పోషక యాజమాన్యం