Vegetable Prices In Sri Lanka: ప్రపంచ దేశాల్లో శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో పడింది. ఆ దేశంలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. కేజీ పాల పొడి ధర శ్రీలంక కరెన్సీలో రూ.1000 పైమాటే. కిలో ఆలుగడ్డల ధర రూ. 200 దాటింది. 100 గ్రాముల పచ్చి మిరపకాయలు కొనాలంటే అక్షరాలా రూ. 71 చెల్లించాల్సిందే. కిలో ఉల్లిగడ్డల ధర రూ. 600 పైమాటే. ధరలు ఇలా రోజురోజుకి పెరుగుతూ ఉండటంతో అక్కడ ప్రజలకు బ్రతుకు భారంగా మారింది.
ఇంతకీ శ్రీలంకలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం వల్లనే అక్కడ ధరలు మండిపోతున్నాయి. రెండు కోట్లకు పైగా ఉండే ఈ చిన్న దేశం అవసరాల కోసం విదేశి దిగుమతుల పైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం అప్పుల భారంతో వడ్డీలు చెల్లించలేని శ్రీలంక దిగుమతులకు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే ఆ దేశాల కరెన్సీలో, డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీలంకలో విదేశి కరెన్సీ నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఈ సమయంలో దిగుమతులను చాలా వరకు తగ్గించేసింది శ్రీలంక. ఫలితంగా నిత్యావసర ధరలు అమాంతం పెరిపోయాయి.
Also Read: హరిత వ్యవసాయం దిశగా శ్రీలంక
గ్యాస్ సిలిండర్ ధర రూ. 1500 నుంచి రూ. 2500 వరకు పెరిగిపోయింది. దీంతో ఆ దేశ ప్రజలు గ్యాస్ సిలిండర్ కొనలేక మళ్ళీ కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. కాగా శ్రీలంక వివిధ పద్దుల కిందా 4.5 బిలియన్ డాలర్ల అప్పులు తీర్చాల్సి ఉంది. ఈ మొత్తం శ్రీలంక కరెన్సీలో చూసుకుంటే రూ. 90 వేల కోట్లు. మొత్తంగా శ్రీలంక దివాళా అంచుకు చేరుకుందని అభిప్రాయపడుతున్నారు ఆర్ధిక నిపుణులు.
Also Read: జంతువులపై ప్రేమ.. ప్రధాని వరకు తీసుకెళ్లింది.!