Akhilesh Promises to Farmers: ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది. విమర్శల ప్రతి విమర్శలతో హీటేక్కిస్తున్నారు నేతలు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. అధికార పార్టీని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఎస్పీ తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా హామీలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు అన్ని రకాల దారుల్ని వెతుక్కుంటున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రైతులపై వరాల జల్లు కురిపించారు.
అఖిలేష్ యాదవ్ ప్రకటించిన వరాలు:
* ఉత్తర ప్రదేశ్ లో అన్ని రకాల పంటలకు MSP (కనీస మద్దతు ధర) అందించబడుతుంది
* చెరుకు రైతులకు 15 రోజుల్లో చెల్లింపులు జరుగుతాయి
* రైతులకు చెల్లింపులు ఆగకుండా ‘రైతుల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తాము.
* రైతులందరికీ సాగునీటికి ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
* రైతులకు వడ్డీలేని రుణాలు, బీమా, పింఛన్‌లు కూడా అందజేస్తామన్నారు.
* రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటాము.
* నిరసనలో మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.
ఎస్పీ అధినేత Akhilesh Yadav మీడియాతో మాట్లాడుతూ.. పైన పేర్కొన్న హామీలన్నీ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగమేనన్నారు. చెరకు రైతులకు 15 రోజుల్లో బకాయిలు చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యేక రైతు రివాల్వింగ్ ఫండ్ ను రూపొందిస్తామని చెప్పారు. బ్లూప్రింట్‌ను ప్రకటించే ముందు రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం తన దృఢ సంకల్పాన్ని తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరికీ 300 యూనిట్ల విద్యుత్ అందజేస్తామని పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చిందని తెలిపారు.
Also Read: సహకారం భారతీయ సంస్కృతిలో భాగమే- అమిత్ షా
రైతుల కోసం తన పార్టీ ప్రణాళికను సవివరంగా వివరిస్తూనే.. బిజెపి పాలనలో రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ బిజెపిపై మండిపడ్డారు. బీజేపీ తన 2017 ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అది నెరవేరిందా? అని సూటిగా ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్‌లో నలుగురు రైతులను నాలుగు చక్రాల వాహనంతో ఢీకొట్టిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలనలో జరిగిన అప్రసిద్ధ జలియన్‌వాలా బాగ్ కేసు కంటే ఈ ఘటన మరింత దారుణమని అన్నారు. జలియన్‌వాలాబాగ్‌లో అమాయకులను బ్రిటీషర్లు కాల్చి చంపారు కానీ లఖింపూర్ ఖేరీ సంఘటనలో ఇంటికి తిరిగి వస్తున్న అమాయక రైతులు వాహనం చక్రాల కింద నలిగిపోయారు అన్నారు.
కాగా.. అఖిలేష్ యాదవ్ ఇచ్చిన వాగ్దానాలపై ఉత్తరప్రదేశ్ బిజెపి చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ హిందీలో ట్వీట్ చేస్తూ.. చేతిలో తుపాకీ పట్టుకుని తిరిగేవారు రైతుల శ్రేయోభిలాషులుగా నటిస్తున్నారు. వారి పాలనలో మన రైతులు భయపడేవారు అని విమర్శించారు.
Also Read: వెదురు సాగుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50% సబ్సిడీ