Dragon Fruit Cultivation: ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతుంది. ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాన చేతుల్లోనే ఉందన్న విషయం తెలియనిది కాదు. ఆరోగ్యాన్ని కాపాడటంలో పండ్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. వైద్యులు కూడా వివిధ రకాల పండ్లను తినాలని సూచిస్తుంటారు . పండ్లు తినడం వల్ల శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అయితే మన శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు అన్నీ ఒకే చోట దొరికే పండు డ్రాగన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి అమెరికన్ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఆసక్తికర విషయాలను చర్చిద్దాం..
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే ఈ రైతులకు ఫార్మింగ్ అనేది కేవలం జీవం విధానం మాత్రమే. డ్రాగన్ ఫ్రూట్ ని ఎంచుకోవడానికి రెండు కారణాలు ప్రభావితం చేశాయి. వియాత్నం అనే ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శించడం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పై వారికి ఆసక్తి పెరగడం, ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడని కారణంగా అక్కడ అగ్రికల్చర్ అసోసియేషన్ వారికి కొన్ని ఆదేశాలు జరీ చేసింది. నీళ్లు తక్కువ అవసరం అయ్యే పంటలను ఎంచుకుని సాగు చేస్తే ఆ రైతులకు అసోసియేషన్ నుంచి అనేక ప్రోత్సాహకాలు అందిస్తామని రైతులకు సూచించారట.
డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు కేవలం రాత్రి సమయంలోనే విచ్చుకుంటాయి. పూసిన పువ్వులు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంటాయి. అయితే వాతావరణం కొంచెం తడిగా ఉంటె ఇంకో గంటసేపు పువ్వులు విచ్చుకుని ఉంటాయి. తర్వాత పువ్వులు వాడిపోయి, ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయిన పువ్వును వారు వెంటనే తొలగిస్తారు. కారణం ఏంటంటే నీళ్లు పోసినప్పుడు కానీ, వర్షపు నీరు పువ్వులో ఉండిపోవడం వల్ల కాయ కుళ్లిపోతుంది. అందుకు వారు పువ్వుని వెంటనే తొలగిస్తారు.
కాగా పువ్వు తర్వాత పక్షుల భారీ నుంచి కాయను కాపాడటానికి కాయకు కవర్లను అమరుస్తారు. అయితే ముందుగా కాయకు తెలుపు కవర్ అమర్చినప్పటికీ, కాయ తయారైనప్పుడు నలుపు రంగు కవర్ ని తొడుగుతారు. నలుపు రంగు కవర్ అమర్చడం ద్వారా కాయను పక్షులు తినకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. పువ్వు వెనుక భాగాన కాండం ఉంటుంది. పువ్వు పూసిన తర్వాత కాయ తయారై చేతికి రావడానికి 42 రోజుల సమయం పడుతుంది. ఒక పువ్వు ఒక కాయను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఒక కాయ వచ్చేసి 10 డాలర్ల నుంచి 15 డాలర్ల వరకు కాయ బరువుని బట్టి ధర పలుకుతుంది.
ఒక్క పువ్వుని కూడా వృధా కానివ్వకుండా రైతులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పంట అమెరికాలోనే కాకుండా ఏ దేశంలోనైనా పండుతుంది. ప్రస్తుతం ఈ ఫ్రూట్ కి డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన అనేక దేశాల్లో డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. ఇక్కడ నాలుగు, ఐదు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ని సాగు చేస్తున్నారు. ఒకవేళ రైతులు డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేయాలి అనుకుంటే మీ ప్రాంత వాతావరణం మరియు పొలాన్ని బట్టి రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
అయితే డ్రాగన్ ఫ్రూట్ సంవత్సరానికి అమెరికాలో ఒక పంట మాత్రమే చేతికొస్తుంది. కాబట్టి ఒక పంటలో 6 నుంచి 7 సార్లు హార్వెస్ట్ చేస్తారు. ఈ పంటపై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎలాంటి యంత్ర పరికరాలను ఉపయోగించకుండా హ్యాండ్ హార్వెస్టింగ్ విధానాన్ని పాటిస్తున్నారు. ఒక్కో చెట్టు నుంచి 90 నుంచి 100 కిలోల దిగుబడి వస్తుంది. ఈ ఫ్రూట్ కోసిన తర్వాత ఏడు రోజుల వరకే నిలువ ఉండటం కారణంగా కోసే ముందు మార్కెట్ తో మాట్లాడుకోవాలి. ఎవరికీ, ఎంత ధరకు అమ్మలో, రవాణా ఏర్పాట్లు ముందు నిర్ణయించుకుని కాయను కోయాల్సి ఉంటుంది. ఇక డ్రాగన్ ఫ్రూట్ ద్వారా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తారు. ఫిషియల్ క్రీం, జ్యూస్, బ్రెడ్ జామ్ ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
Also Read: అమెరికా క్యాప్సికం సాగుపై తెలుగమ్మాయి అనుభవాలు
అమెరికన్ డ్రాగన్ ఫ్రూట్ సాగులో సమస్యలు:
డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతులు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. చీమలు, అఫిడ్స్, పక్షులు డ్రాగన్ ఫ్రూట్ ని ఆకర్షించి పంటను నాశనం చేస్తాయి. చీమలు చెట్టు కాడని మాత్రమే తింటాయి. అలా కాడని తినడంతో చెట్టులో బలం తగ్గి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక పక్షులు కాయని తింటాయి. అఫిడ్స్ పురుగులు పువ్వు సమయంలో ఆకర్షిస్తాయి. అఫిడ్స్ సమస్య వచ్చినప్పుడు ఆర్గానిక్ స్ప్రే కొట్టాల్సి ఉంటుంది. అయితే అఫిడ్స్ కాయకు హాని చేయదు కానీ మార్కెట్లో కాయకు ఉన్న ధరని తగ్గించేస్తుంది. అంటే కాయ సెకండ్ గ్రేడ్ గా మారుతుంది.
రవాణా:
ప్రతి రోజు ఏ చెట్టుకు ఎంత మేర పండ్లు ఉన్నాయి?, ఎన్ని ఫ్రూట్స్ కోయాలి అన్నది ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇక కాయని కోసి నిల్వ చేయకుండా వెంటనే మార్కెట్ కు తరలిస్తారు. అయితే మార్కెట్ కు తరలించే క్రమంలో కాయలను రెండు భాగాలుగా విభజిస్తారు. అఫిడ్స్ సోకినా కాయలు, ఎండకు వాడిన కాయలను, మచ్చలు వచ్చిన కాయలను ఒక రకంగా, అదేవిధంగా తాజా ఆరోగ్యమైన కాయలను మరో రకంగా విభజించి వాటిని ప్యాక్ చేసి మార్కెట్ కి తరలిస్తారు.
Also Read: ఎర్రచందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?