Sorghum Harvest: మన రాష్ట్రంలో జొన్న పంట ఖరీఫ్‌లో 3.0 లక్షల ఎకరాల్లోను, రబీలో 4.25 లక్షల ఎకరాల్లోను సాగుచేయబడుతున్నది. ఎకరా సరాసరి దిగుబడి ఖరీఫ్‌లో 638 కిలోలు, రబీలో 610 కిలోలు.
జాగ్రత్తలు:
- పంట కోతకు వచ్చినపుడు కంకులు లేదా బుట్టలపై పొరలు ఎండినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కలపై క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి మరియు కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినపుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు.
- అంతేకాకుండా, బుట్టలోని గింజలను తీసి అడుగుభాగం పరీక్షించినచో (కొన్ని రకాలకు) ఒక నల్లని చార ఉండడం గమనించవచ్చు.
- ఈ దశలో గింజలో సుమారుగా 25-30 శాతం తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరుచేసి గింజలలో తేమ శాతం 12-15 వచ్చే వరకు 3-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి.
- పేలాల రకం వేసినపుడు గింజలో 30-35% తేమ ఉన్నపుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే సరియైన పేలాలుగా మారక గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినపుడు గింజ పాలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి.
- బేబీకార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచుశాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినపుడు 50% పూతదశలో పైరును కోయాలి.
Also Read: పశుగ్రాస జొన్న సాగులో మెళుకువలు….
- ఈ దశలో కంకులను నూర్పిడి చేయుటకు (గింజలను బుట్ట నుండి వేరు చేయుట) ట్రాక్టరుతో నడుచు నూర్పిడి యంత్రం లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి, శుద్ధి చేసి గోనె సంచులలో గాని లేదా పాలిథీన్ సంచులలో గాని భద్రపరచి చల్లని తక్కువ తేమ గల ప్రాంతాలలో నిలువ చేయాలి.
- దీనితో బాటు నీరు గాని, ఎలుకలు, పురుగులు లేదా శిలీంద్రాలు మొదలగునవి రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: ప్రధాని మోదీ విడుదల చేసిన 35 పంట రకాల పూర్తి వివరాలు..
Leave Your Comments