జాతీయంవార్తలు

అస్సాంలో వ్యవసాయ కమీషన్ ఏర్పాటు…

0
Assam Agricultural Commission

Assam Agricultural Commission: అస్సాం ప్రభుత్వం ఆ రాష్ట్ర వ్యవసాయ రంగానికి గానూ వ్యవసాయ కమీషన్‌ను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బక్సా జిల్లాలోని నబా దిహిరాలో కాలేజ్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ & బయోడైవర్సిటీ మరియు బెంగాల్ ఫ్లోరికన్ కన్జర్వేషన్, రీసెర్చ్ & ఎకోటూరిజం సైట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ CM Himanta Biswa Sarma శంకుస్థాపన చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.
Himanta Biswa Sarma

కోకొలబరి అగ్రి ఫామ్‌కు చారిత్రక నేపథ్యం ఉందని, వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వనరుల గరిష్ట వినియోగానికి కృషి, తలసరి ఆదాయం, మరియు GDPని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అయన వివరించారు.

kokolabari agri

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ అస్సాం ఇప్పటికీ బయటి నుండి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేయాలనే సంకల్పం లేకుంటే వాక్చాతుర్యం మాత్రమే జాతిని ముందుకు తీసుకెళ్లదు, శక్తివంతమైన వ్యవసాయ కార్యకలాపాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. Assam Agricultural Commission

Assam Agriculture

కోకోలబరి అగ్రి ఫామ్‌లో జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని తెలియజేసారు. భూసార పరిరక్షణ శాఖకు నిధులు కేటాయించడంతోపాటు ఈ ప్రాంతంలో నదీ కోత రక్షణ కోసం పథకాలను చేపట్టడంతోపాటు స్థానిక ప్రజల ఇతర డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

అనంతరం మానస్ నేషనల్ పార్క్‌లోని స్థానిక సంఘం సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, అటవీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అలాగే MNP రక్షణలో ఆదర్శవంతమైన సేవలందించిన ఫారెస్ట్ గార్డులు, ఫారెస్టర్లు మరియు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. స్థానిక కమ్యూనిటీల కోసం ఎకో టూరిజం మరియు ఇతర జీవనోపాధి పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం చెప్పారు.

Agriculture News, Eruvaaka Daily Updates

Leave Your Comments

China Education: చైనా విద్యార్థులకు పందులను బహుమతిగా ఇచ్చిన టీచర్లు

Previous article

గోదారి అల్లుడికి 365 వంటలతో అత్తింటి వారి ఆతిథ్యం..

Next article

You may also like