Sheep Transport: ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డి లో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడి తో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది.
రవాణా జాగ్రత్తలు:
- గొర్రెలను కొనుగోలు చేసిన తరువాత గమ్యస్థానానికి రవాణా చేసేటప్పడు గొర్రెలకు గాయాలు కాకుండా జాగ్రత్త కొరకు రవాణా వాహనంలో తగినంత స్థలాన్ని కేటాయించాలి.
- 26-30 కిలోల బరువున్న గొర్రెకు 2.15 చదరపు అడుగులు మరియు 31-40 కిలోల బరువున్న గొర్రెకు 2.60 చ.అడుగుల స్థలాన్ని కేటాయించాలి.
- ప్రయాణానికి గొర్రెలు శారీరకంగా, ఆరోగ్యంగా సంసిద్ధంగా ఉన్నది లేనిదీ ప్రయాణానికి ముందు చూసుకోవాలి. బలహీనంగా ఉన్న వాటిని, 1-2 రోజుల్లో ఈనబోయే గొర్రెలను రవాణా చేయకూడదు.
- గొర్రెలను వాతావరణం చల్లగా ఉన్నప్పడు లేదా రాత్రిపూట మాత్రమే రవాణా చేయాలి. ప్రయాణ కాలం 12 గంటల పైబడి ఉంటే 12 గంటల విశ్రాంతి ఇవ్వాలి. నీరు, మేత మాత్రమే అందించాలి. వీలైతే బయట మేపుకు తీసుకెళ్ళాలి.
- గొర్రెలను రవాణా వాహనంలో ఎక్కించేటప్పడు మరియు గమ్యస్థానంలో దించేటప్పడు తీగ ఏర్పాటు చేయాలి.
Also Read: గొర్రెల్లో వచ్చే చిటుక వ్యాధి
- వాహనంలో గొర్రెలు ఒకదాని మీద ఒకటి పడకుండా ఉండేవిధంగా గమనించడానికి లబ్దిదారుడిని లేదా ఇతర వేరే వ్యక్తిని ఒకరిని కాపలా ఉంచాలి.
- గొర్రెలను వాహనంలో తరలించేటప్పడు కొన్ని గొర్రెలు మ్యామినియ లాంటి వ్యాధి లక్షణాలతో బాధపడతాయి. రవాణా సమయంలో 12 గంటలు మించి ఉంటే దీర్ఘ కాలం పనిచేసే యాంటిబయాటిక్ మరియు యాంటి ఇనప్లమెటరి మందులు పశువైద్యుని సూచన మేరకు ఇప్పించాలి.
- గొర్రెలు వచ్చిన తరువాత 3-4 గంటలు విశ్రాంతి ఇవ్వాలి.
- గాయాలు, ఎముకలు విరగటం లాంటివి ఉన్నవో లేదో పరిశీలించాలి. ఆరోగ్య లక్షణాల కొరకు పరిశీలించిఒకవేళ అనారోగ్య లక్షణాలు ఉంటే వాటిని వేరుగా ఉంచి 15 రోజుల తదుపరి ఆరోగ్యంగా ఉన్న మందలో కలపాలి.
Also Read: ఆడ గొర్రెల ఎంపిక విషయం లో తీయాల్సిన జాగ్రత్తలు
Leave Your Comments