Emu Bird Farming: ఈమూ పక్షులు రేటైట్ (Ratite – అడుగుభాగం లేని వక్షశల్య జాతి) జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడ ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ మరియు ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం మరియు ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విస్తృతమైన పెంపక క్షేత్రాలలో (Rancher) మరియు తక్కువ వైశాల్యం గల ప్రదేశాలలో కూడ ఈ పక్షులను, అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి బాగా పెంచవచ్చు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, మరియు చైనా, ఎమూ పెంపకంలో ముందున్నాయి. ఎమూ పక్షులు, భారత దేశ వాతావరణ పరిస్థితులకు చక్కగా యిమిడి పోయాయి.
ఈమూ పక్షి పిల్లల పెంపకం:
ఈమూ పక్షి పిల్లలు సుమారు 370 గ్రాములు నుండి 450 గ్రాములు (సుమారు 67% గుడ్డు బరువులో) బరువు, గుడ్డు పరిమాణం (సైజు) పై ఆధారపడి ఉంటాయి. మొదటి 48 – 72 గంటలు, గుడ్డులోని పచ్చసోన శోషణం జరిగి అది పూర్తిగా ఎండి పోయేదాకా, ఎమూ పక్షి పిల్లలు, పోదగబడే స్థలంలోనే నియంత్రించబడతాయి. పక్షి పిల్లలు, రాక ముందే, పెంపక కేంద్రమును (శీల) పరిశుభ్రంగా, వ్యాదులు సోకకుండా తగిన జాగ్రత్తలతో సమగ్రంగా తయారు చేయాలి. వరిధాన్యపు ఊకను శీల అంతా పంచి, వాటి పై క్రొత్త గోనె సంచులతో గాని, ములక నార బట్టలతో గాని కప్పాలి. మొదటి మూడు వారాలు, ఒక పక్షి పిల్లకు 4 చదరపు అడుగుల చొ||న 24 – 40 పక్షి పిల్లలను పెంచడానికి వీలుగా ఒక పెంపకశాలను అమర్చాలి. మొదటి పది రోజులు 90o f ఉష్ణోగ్రత, తరువాత, 34 వారాల వరకు 85o f ఉష్ణోగ్రత సమకూర్చాలి. సక్రమ మైన ఉష్ణోగ్రతను కల్పించడం ద్వరా పొదగబడిన పిల్లలు ఎటువంటి సమస్యా లేకుండా ఎదుగుతాయి. తగినన్ని 1 లీటరు నీరు పట్టే మగ్గులు (లోటాలు) మరియు అంతే సంఖ్యగల మేత తోట్టెలను, శీల క్రింద ఉంచాలి. పక్షి పిల్లలు గెంతకుండా, దారి తప్పి పోకుండా ఒక 2.5 అడుగుల రక్షణ వలయ కట్టడం అవసరం. ఒక 40 వాట్ల బల్బు, పెంపకశాలలో (brooding shed) ప్రతీ 100 చ|| అడుగుల స్థలానికి రోజంతా వెలుగుతూ ఉండాలి. మూడు వారాల తరువాత, పెంపక శీల స్థలాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ అదే సమయంలో రక్షణ వలయ కట్టడాన్ని (chic guard) ఇంకొంచెం ముందుకు నెడుతూ, చివరకు, పక్షిపల్లల ఆరు వారాల వయసు వచ్చేసరికి దానిని పూర్తిగా తీసివేయాలి. మొదటి 14 వారాల లేక, శరీర బరువు ప్రామాణికంగా 10 కేజీలు పెరిగేవరకూ, గుజ్జుగా చేసినమేతను యివ్వాలి. పక్షుల ఆరోగ్యకరమైన జీవితానికి, అవి పరిగెట్టలిగేంత అంటే 30 అడుగుల స్థలం ఉండేటట్లు పెంపకశాలలో ఏర్పాట్లు చేయాలి. దీనికోసం 40 అడుగులు (feat) x 30 అడుగులు (feat) స్థలం, సుమారు 40 పక్షి పిల్లలకు అవసరం (బయట ప్రాంగణం ఉన్నట్లైతే). స్థలం, సులభంగా ఎండిపోయేది, తేమ లేనిదీ అయి ఉండాలి.
Also Read: కౌజు పిట్టల పెంపకం వలన కలిగే లాభాలు
చేయదగినవి:
- పెంపక ఆవరణలో (కొట్టంలో) ఎప్పుడూ ఎక్కువ పక్షులను ఉంచవద్దు.
- మొదటి కొన్ని రోజులు, శుభ్రమైన నీరు, వత్తిడిని తగ్గించే పదార్థాలను అందించాలి.
- నీటిని రోజూ శుభ్రపరచాలి. లేదా యాంత్రికమైన (automatic) నీటి సరఫరా చేయాలి.
- పక్షులను రోజూ, వాటి సౌకర్యాలు, తీసుకునే ఆహారం, త్రాగే నీరు, ఊత పరిస్థితి మొదలైన వాటి గురించి పర్యవేక్షిస్తూ వెనువెంటనే చేయవలసిన దిద్దుబాట్లు ఏవైనా ఉంటే చెయ్యాలి.
- ఖనిజ లవణాలు (minerals), విటమిన్లు (vitamins), మేతలో తగినంత ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి లేకుంటే, పిల్లలు సక్రమంగా ఎదగవు మరియు వాటికాళ్లలో లోపాలు ఏర్పడతాయి.
- అంతా లోపల (all-in), అంతా బయట (all-out) పెంపక విధానం పాటించడం వలన మేలైన జీవరక్షణ నిర్వహణ సాధ్యమౌతుంది.
చేయకూడనివి:
- పక్షులను ఎప్పడూ, వేడిగా ఉన్న సమయాల్లో సంచాళించరాదు
- పక్షులు త్వరగా ఉద్రేకపడతాయి. అందువలన, కొట్టంలో నిశ్శబ్దమైన, ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి.
- పక్షులు సులభంగా, త్వరగా ఎటువంటి వస్తువునైనా లాక్కుంటాయి. అందువలన, కొన్ని రకాల వస్తువులను ఉదాహరణకు మేకులు, గుల కరాళ్ళు మొదలైన వాటిని పక్షులకు చేరువలో లేకుండ చూడాలి.
- తెలియని వ్యక్తులను, పదార్థాలను పెంపక కేంద్రంలోనికి అనుమతించరాదు. సక్రమమైన, జీవ రక్షణ (bio security) వ్యవస్థను నిర్వహించాలి.
- నున్నని, వరి ఊక పరచిన స్థలంలో ఎప్పుడూ పక్షి పిల్లలను ఉంచరాదు ఎందుకంటే, చిన్న పిల్లలు త్వరగా ఉద్రేకపడి, పరిగెట్టి, నెల జరేటట్లు ఉండడం వలన, వాటి, కాళ్ళకు హాని చేసుకుంటాయి.
Also Read: మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం