అంతర్జాతీయంవ్యవసాయ వాణిజ్యం

Sandalwood: ఎర్రచందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?

0
why red sandalwood is costly

why red sandalwood is costly: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న విలువ అందరికి తెలిసిందే. కానీ బంగారం కంటే పది రేట్లు ఎక్కువ ధర పలికేది ఎర్రచందనానికి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనం చెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. విశేషం ఏంటంటే అరుదైన ఈ ఎర్రచందనం చెట్లు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలో పెరగడం. ఎర్రచందనం చెట్లు చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలోని శేషాచలం, వెలుగొండ, లక్కమల, నల్లమల అడవులలో దొరుకుతాయి. ఎర్రచందనం శాస్త్రీయ నామం టెరో కార్పస్ సాంటలైనస్.

why red sandalwood is costly

ఎర్రచందనం శేషాచలం అడవుల్లోనే ఎందుకు పెరుగుతుంది? why red sandalwood is costly

చిత్తూరు జిల్లాలో క్వాలిటీ ఎర్రచందనం పెరుగుతుంది. ఇక్కడ ఉన్న మట్టి ఎర్రచందనానికి అనువుగా ఉంటుంది. అదీ కాకా..శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తుల్లో వున్నాయి. ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైంది. అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి.

why red sandalwood is costly

ఎందుకు అంత డిమాండ్?
ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనానికి డిమాండ్ విపరీతంగా ఉంది. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఇంటి సామాగ్రి, పాత్రలు , గిన్నెలు కూడా ఎర్రచందనం తో తయారు చేయబడతాయి. అలాగే సంగీత వాయిద్యాలు కూడా తయారు చేస్తారు. అందులో ఔషధ గుణాలు ఉండటం, వయాగ్రా, కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో కూడా చందనాన్ని వినియోగిస్తారు. అంతేకాకుండా అల్సర్ ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్నిశుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్ర చందనంలో పుష్కలంగా ఉంటాయి.

why red sandalwood is costly

రైతులకు సాగు చేయవచ్చా?

ప్రభుత్వ అధికారుల నుంచి ముందే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాగుకై ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల నుంచి పర్మిషన్ తీసుకోవాలి.కాగా.. రైతుల ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ సాగు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్నిపెంచుకోవడానికి విరివిగా ప్రభుత్వం అనుమతిస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుంది.

Eruvaaka

Leave Your Comments

ACE Tractors: ACE ట్రాక్టర్ల సంస్థ నుంచి VEER- 20

Previous article

Proso millet: వరిగలలో ఆరోగ్య విలువలెన్నో…

Next article

You may also like