మన వ్యవసాయం

Vertical Farming: రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయం లో ఈ టెక్నిక్ ఉపయోగించి ఏడాదికి 2.5 కోట్లు సంపాదించొచ్చు.!

0

Vertical Farming: 2050 నాటికి భారతదేశ జనాభా 1.64 బిలియన్లకు చేరుతుందని అంచనా. అయితే ఇంత మందికి.. ఆహారం అందించడం అంటే మాటల. కాదు కదా.. నిజం చెప్పాలంటే అది ఒక సవాలే. కొన్నేళ్లుగా జరుగుతున్న.. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కారణంగా మనం ప్రతిరోజూ వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోతున్నాము. ఇలాంటివి అన్నీ చూసినప్పుడు ఫ్యాక్టరీల్లో పండ్లు, కూరగాయలు పండించే విధానం దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది.

Vertical Farming

Vertical Farming

ఇవన్నీ ఆలోచించాక.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీకి ఆదరణ లభిస్తోంది. దీనినే వర్టికల్ ఫార్మింగ్(నిలువు వ్యవసాయం) అంటారు. ఉన్న ప్లేస్ లోనే ఇంకా ఎక్కువ పండిచొచ్చు అన్నమాట. నేల మీద.. నేలపైనా ఈ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే బంజరు భూమిలోనూ ఈ వ్యవసాయం చేయోచ్చు. ఇలాంటి విధానాన్ని ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో ప్రారంభించారు. ఇక్కడ పసుపును వర్టికల్ ఫార్మింగ్ ద్వారా పండిస్తున్నారు.

Also Read: మినుముల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఒక రకమైన షెడ్డులో సాగు చేస్తూ.. ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావం నుంచి పంటను రక్షించుకోవాలి. ఇజ్రాయెల్ తక్కువ భూవిస్తీర్ణంలో, తక్కువ నీటిలో కూడా సాగు చేసే ఈ పద్ధతిని ఆవిష్కరించింది. ఇలా చేస్తే.. అధికంగా దిగుబడి వస్తుంది. ముందుగా దీనికోసం గ్రీన్‌హౌజ్ ఏర్పాటు చేసుకోవాలి. గ్రీన్‌హౌజ్‌లో నేలను క్రమ పద్ధతిలో చదును చేసి గాల్వనైజ్డ్ ట్రే సిస్టమ్‌లో పసుపు మొక్కలు నాటాలి. అంటే.. షెడ్డులో నాలుగు, ఐదు వరుసలు ఉండే నిలువు ట్రేలు ఏర్పాటు చేసుకోవాలి. చిన్న డబ్బాల్లో పసుపు మొక్కలను పెంచాలి. వీటికి డ్రిప్ సిస్టమ్‌ ద్వారా నీరు అందించాలి.

పసుపు అనేది ఇళ్లలో ఆహార పదార్థాల్లోనేకాదు.. దర్య సాధనాలు మరియు ఫార్మా పరిశ్రమలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్‌తో మీరు కేవలం 1 ఎకరం నుంచి 100 ఎకరాల ఉత్పత్తిని పొందవచ్చు. సుమారు 2.5 కోట్ల రూపాయలు(వర్టికల్ ఫార్మింగ్‌లో లాభం) సంపాదించవచ్చు.

మహారాష్ట్రలోని ఓ ప్రాజెక్టులో జరిగినట్లుగా ఒక ఎకరంలో 11 పొరల ట్రేలు ఏర్పాటు చేశారు. అంటే 1 ఎకరంలో సుమారు 6.33 లక్షల విత్తనాలను నాటవచ్చు. ఒక మొక్కలో సగటున 1.67 కిలోల దిగుబడిని పొందవచ్చు. ఎకరాకు మీ దిగుబడి దాదాపు 10 లక్షల కిలోలు. ఈ పసుపును విక్రయించే ముందు ప్రాసెస్ చేయాలి.

ఎండబెట్టిన తర్వాత.. మీకు 250 టన్నుల పసుపు మిగిలి ఉంటుంది. పసుపు ధర కిలో రూ. 100 ఉంటే.. రూ. 2.5 కోట్లకు అమ్ముకోవచ్చు. విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులు రూ.50 లక్షలు అనుకున్నా.. రూ.2 కోట్ల లాభం

Also Read: వ్యవసాయ ఉత్పత్తికి గ్రీన్ హౌస్ టెక్నాలజీ

Leave Your Comments

Spinach farming: పాలకూర సాగులో మెళుకువలు

Previous article

Water Hyacinth: చెరువుల్లో ఉండే గుర్రపుడెక్క యాజమాన్యం.!

Next article

You may also like