పశుపోషణ

Broiler Chicken Farming: బ్రాయిలర్ కోళ్లని పెంచుతున్నారా…? అయితే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి.!

1

Broiler Chicken Farming: బ్రాయిలర్ కోళ్ల పెంపకం తో అదిరే లాభాలని పొందొచ్చు. అయితే వీటిని పెంచడం ఎక్కువ శ్రమ తో కూడుకున్నది. అలానే కొంచెం రిస్క్ కూడా తీసుకోవాలి. కానీ ఏడాది మొత్తం కూడా చక్కటి రాబడిని ఇది ఇస్తుంది. అయితే వీటిని పెంచాలంటే ఆరోగ్యకరమైన కోడిపిల్లల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Broiler Chicken Farming

Broiler Chicken Farming

అలానే కోళ్ల షెడ్లని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే విధంగా మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేదంటే కోళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మరి వాటి కోసం కూడా ఇప్పుడు చూద్దాం. సీజన్ లో మార్పు రావడం వల్ల కోళ్ళకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రాయిలర్ కోళ్ళ లో ఎక్కువగా రక్తపారుడు, గంబోర, కొక్కెర తెగులు వంటివి సోకకుండా ఉండాలంటే టీకాలు వేయించాలి.

Also Read: పశువులదాణాకు ప్రత్యామ్నాయంగా …అజొల్లా

శ్వాసకోశ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే యాంటీబయోటిక్ ని వాటికి ఇచ్చే ఆహారంలో కానీ నీటిలో కానీ కలిపి పెట్టాలి. ఇక శీతాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే… శీతాకాలంలో మనుషులమే చలిని తట్టుకోలేము.

వాతావరణం అధిక తేమతో కూడి ఉంటుంది దీనితో లిట్టర్ త్వరగా తడిగా అవుతుంది. కనుక దానిని పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. దీని కోసం తరచూ కొత్త లిట్టర్ మరియు పొడి సున్నం తరచు జల్లాలి. అలానే రోజు వారీగా డ్రింకర్ లను వేరు వేరు ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలి. స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.

అదే వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. వేసవి కాలం లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి షెడ్డు మీద గడ్డి కానీ మరి ఏమైనా కానీ పరిచి సూర్యరశ్మి తీవ్రతను తగ్గించాలి. ప్రతి గంటకొక సారి గోడలకి నీళ్లు చల్లుతూ ఉండాలి. చల్లని నీటిలో ఎలక్ట్రోలైట్స్ కలిపి అందించాలి. ఇలా యజమానులు వేసవికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: నల్ల కోళ్ల పెంపకం.. రైతు లాభం

Leave Your Comments

Integrated Farming: ఎకరం విస్తీర్ణంలో సమీకృత సేద్యం చేస్తు స్ఫూర్తిగా నిలుస్తున్న యువ రైతు.!

Previous article

Livestock Insurance: పశువుల భీమా పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.!

Next article

You may also like