Gold Plated Sweet: సాధారణంగా కేజీ స్వీట్ ధర రూ. 300 లేదా రూ.1000 లోపే ఉంటుంది. అదీ కాక స్వీట్ షాపుల్లో కలాకాని లాంటి స్వీట్లపై వెండి పూత ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఒక స్వీట్ ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. కేవలం ఢిల్లీ మిఠాయి షాపుల్లో లభించే ఆ స్వీట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. గ్రాము బంగారం కొనుక్కున్నా రేపు అవసరానికి పనికొస్తుంది. కానీ 16వేలు పెట్టి స్వీట్ ఎవరు కొంటారు?. అంత పెద్ద మొత్తంలో స్వీట్ ధర ఏంటని ఆశ్చర్యపడుతున్నారా? కానీ ఇది నిజం.
నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్‌పై బంగారం రేకులను (Gold Plated Sweet) పూతగా వేస్తారు. దీంతో ఆ స్వీట్స్ గోల్డ్ కలర్‌లోకి మారిపోతాయి. నోరూరించే ఈ గోల్డెన్ స్వీట్‌పై అదనంగా నాణ్యమైన కుంకుమ పువ్వును ఉంచుతారు. మరి ఈ స్వీట్ ఎక్కడపడితే అక్కడ దొరికేది కాదు. 16 వేలు పెట్టి స్వీట్ కొనుగోలు చెయ్యాలంటే మీరు ఢిల్లీ వెళ్లాల్సిందే. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న షాగూన్ స్వీట్ షాపు ఇలాంటి యూనిక్ స్వీట్స్‌కు ప్రసిద్ది.
Also Read:ఆవాల పంటలో సస్య రక్షణ చర్యలు
దీనికి సంబంధించిన వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ వీడియోని ఇప్పటివరకు 6 లక్షల 22 వేలకు పైగా లైక్స్.. వందల కామెంట్స్ చేశారు. మరో విశేషం ఏంటంటే ఆ స్వీట్ ధర కేజీ అక్షరాలా 16 వేలు ఉన్నప్పటికీ జనాలు ఎగబడి కొంటున్నారు. కేజీ కాకపోయినా 1000, 2000 పెట్టి ఆ స్వీట్ ని రుచి చూడాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read:వర్షధార వ్యవసాయంలో నూనె గింజల సాగు – ప్రాముఖ్యత