Rythu Rajyam Party President: తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప (Boggula Gurappa) డిమాండ్ చేశారు. వైరస్ తెగుళ్లు, తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని బొగ్గుల గురప్ప డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఈ సంవత్సరం మిర్చి పంట వేశారని, ముఖ్యంగా గుంటూరు ప్రకాశం కృష్ణ , అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో అధికంగా చేశారన్నారు. తామర పురుగు వల్ల రాష్ట్రంలో మిర్చి పంట దెబ్బతిందని, గతేడాది బొబ్బర తెగులు వల్ల నష్టపోయిన రైతులకు ఈ వైరస్ తెగులు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఉందన్నారు ఆయన. గతేడాది ఆశాజనకంగా ఉండటంతో రైతాంగం మిర్చి పంట ఎక్కువగా సాగు చేశారని, మరొకవైపు నకిలీ విత్తనాలతో కొన్ని చోట్ల మిర్చి పంట దెబ్బతిందని అన్నారు.
Also Read: తెలంగాణలో చామంతి సాగు విధానం
మిర్చి పంటలో సన్న చిన్న కారు మరియు కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ప్రతి ఎకరాకు కవులు పెట్టుబడి శ్రమ మొత్తం కలిపి దాదాపు లక్ష రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు. దీని ప్రకృతి విపత్తుగా పరిగణించి ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్త సాగు దారులైన రైతుల పేర్లను ఈ క్రాఫ్ట్ బుకింగ్ లో నమోదు చేయాలని మరియు పంట మొత్తాన్ని ఎన్యుమ రేట్ చేయాలని డిమాండ్ చేశారు. పంట దెబ్బతినడంతో పనులు కోల్పోతున్న వ్యవసాయ కూలీలకు ప్రత్యేక ఉపాధి పనులు కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు రాజ్యం పార్టీ ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.
Also Read:రైతు బంధు ఓ గేమ్ ఛేంజర్- నిరంజన్ రెడ్డి