Homoeopathy In Chilli Crop మారిన వాతావరణ పరిస్థితుల వల్ల మిర్చి పంటకు తామర తెగులు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఎన్ని రసాయనిక మందులు పిచికారీ చేసినా నల్ల పేను తగ్గడం లేదు. పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో పంటకు నిప్పు పెడుతున్నారు. ఇక పంటకు తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ సనాతన హోమియో ఫైద్యం ఇప్పుడు ఔషధంగా మారింది. తామర పురుగు నుంచి పంటను కాపాడుతుంది.
భువనగిరికి చెందిన బాలిరెడ్డి మిర్చి పంటకు హోమియో వైద్యంపై పదమూడేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. హోమియో మందుతో తామర తెగుళ్లను అంతం చేయవచ్చని చెప్తున్నారు బాలిరెడ్డి. 75 రూపాయల ఖర్చుతో ఎకరా పంటకు మందు తయారు చేసుకోవచ్చు అని అయన అంటున్నారు. ఈ మందుతో నల్ల పేను బెడద పోయి, మంచి దిగుబడి వస్తుందంటున్నారు. బాలిరెడ్డి గారు మాట్లాడుతూ.. ఏ పంటలోనైనా పురుగు పట్టడం సహజం. దానికి నేను ఆరేనియా డయోడిమ అనే మందును తీసుకొచ్చాను. గుంటూరు జిల్లాలో ఈ మందు వల్ల ఎంతోమంది రైతులు సత్ఫాలితాలు పొందుతున్నారు. దీన్ని 30 పర్సెంటేజ్ లో తీసుకుని స్ప్రే చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. Homoeopathy In Chilli Crop
మందు వాడే పద్దతి:
మందును 2.5 ML తీసుకోవాలి. ఒక ఖాళీ బాటిల్ లో సగం మేర నీరు నింపుకోవాలి. బాటిల్ లో 2.5 ML మందును కలపాలి. తర్వాత 20 లీటర్ల నీటిలో ఆ మిశ్రమాన్ని కలియతిప్పి స్ప్రే చేసుకోవాలి. అయితే 2.5 ML మందు సరిపోతదా అనే అనుమానం అవసరం లేదంటున్నారు బాలిరెడ్డి గారు. ఇక బాలిరెడ్డి సూచించిన విధంగా గుంటూరు జిల్లాకు చెందిన కొందరు రైతులు పాటించి మంచి సత్ఫాలితాలు సాధించామని చెప్తున్నారు. హోమియో దుకాణాల్లో దొరికే తూజా, ఆరేనియా డయోడిమ తో పాటు నైట్రిక్ యాసిడ్ ని వాడి పంటను కాపాడుకున్నామని రైతులు చెప్తున్నారు. దీంతో నల్ల తామర సమస్య నుంచి బయటపడ్డామని చెప్తున్నారు ఆ రైతులు. Agricultural Homoeopathy