-
ప్రతి ఏడాది రైతుల రుణ లక్ష్యాన్ని పెంచుతున్న కేంద్రం
-
ఈ ఏడాది అగ్రి క్రెడిట్ లక్ష్యాన్ని దాదాపు రూ.18 లక్షల కోట్లకు పెంపు
-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.16.5 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది
2022 Budget : దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిదే కీలకపాత్ర. ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యాన్నిపెంచుతూ వస్తున్న కేంద్రం ఈ సారి కూడా అదే తీరుతో ముందుకు వెళ్లనుంది. అందులో భాగంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి 1న సమర్పించనున్న 2022-23 బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అదే విధంగా 2016-17లో రుణ లక్ష్యం రూ.9 లక్షల కోట్లకు మించి రూ.10.66 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. Farmers Agri Credits
వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ రుణం కీలకం. రైతులు అధిక వడ్డీ రేట్లకు బలవంతంగా రుణాలు తీసుకోవలసి వచ్చే సంస్థాగతేతర వనరుల నుండి విముక్తి పొందడంలో ఈ చర్యలు సహాయపడతాయి. సాధారణంగా వ్యవసాయ రుణాలపై 9% వడ్డీ రేటు ఉంటుంది. మరోవైపు, ప్రభుత్వం స్వల్పకాలిక పంట రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి వడ్డీ రాయితీలను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి రెండు శాతం వడ్డీ రాయితీతో రైతులు సంవత్సరానికి 7% ప్రభావంతమైన రేటుతో రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను పొందవచ్చు. రైతులు తమ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనంగా 3% ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. 2022 Budget
కాగా.. దేశంలో 2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇది వరకే ప్రకటించారు.
Agriculture Daily News, Latest Agriculture Updates, To Day Agriculture News