Vedic farming method in agriculture వరిలో మూస పద్ధతికి స్వస్తి పలుకుతూ ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక రంగంలో విభిన్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతులు. ప్రస్తుతం వెద పద్దతి అందర్నీ ఆకర్షిస్తుంది. వెద పద్దతిలో వ్యవసాయం చేస్తూ కొందరు రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. Vedic farming method
ఈ విధానంలో నారు పెంచే అవసరం ఉండదు. కూలీలా ఖర్చు, నారుమడికి ఎరువు అవసరం ఉండదు. వెదజల్లే పద్ధతిలో సాధారణ పొలం మాదిరిగానే దమ్ము చేసుకోవాలి. పొలాన్ని ఎత్తు పల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. అయితే ఈ విధానంలో ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. ఇక విత్తనం ఒకరోజు నానబెట్టి పొలంలో వెదజల్లుకోవాలి. ఎత్తుపల్లాలు ఉండటం వల్ల నీరు నిలిచే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే నీరు నిలిచిన చోట విత్తనం మొలకేత్తె అవకాశం ఉండదు. ఇక పొలంలో 25 రోజుల వరకు నాలుగు రోజులకోసారి నీరు పెట్టుకోవాలి. పొలమంతా విత్తనం మొలకెత్తిన అనంతరం మామూలుగానే నీరు కట్టుకోవాలి. ఈ పద్ధతిలో విత్తనం ఒకదానితో ఒకటి కలువకుండా దూరంగా పడటంతో మొక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. వేర్లు బలంగా పెరుగుతాయి. మరీ ముఖ్యంగా చీడపీడల సమస్య కూడా తక్కువగానే ఉంటుంది. ఇది రైతులకు మంచి శుభపరిణామం. అంతేకాకుండా పిలకలు బలంగా ఉండటంతో గాలివానలను తట్టుకుని నిలబడతాయి. New Method In Agriculture
విత్తనం విత్తే విషయంలో కొన్ని మెళుకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో పొడి విత్తనం విత్తే పద్దతి, తడి విత్తనం విత్తే పద్ధతుల్లో అవగాహనా పెంచుకోవాలి. పొడి విత్తనాలను పొడి నేలపై వెద జల్లడం ద్వారా, డ్రిల్లింగ్ చేయడం ద్వారా, వెద సాగు పరికరాలతో గాని విత్తుకోవాలి. వరి విత్తనాన్ని పొడి వాతావరణంలో విత్తి, తరువాత వానలు మొదలై కాలువలకు నీళ్లు వచ్చిన అనంతరం మాగాణి పంటల మాదిరిగా సాగు చేస్తారు. తొలకరి వానలు పడగానే విత్తనాలు విత్తుతారు. అటు వర్షపు నీటిని, కాలువల నీటిని ఉపయోగించుకుంటూ వరిని సాగు చేస్తారు. ఇక తడి విత్తనాన్ని విత్తే పద్ధతిలో మొలకెత్తించిన విత్తనాలను దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని లేదా డ్రమ్ము సీడర్ ద్వారా గాని విత్తుతారు. తడి విత్తనాన్ని అంటే.. నానబెట్టి, మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసిన మాగాణుల్లో వెదజల్లడం ద్వారా గాని, డ్రమ్ సీడరు ద్వారా గాని విత్తుతారు. Agriculture Updates