Neem Oil and Crop Protection వేపనూనెకి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా వేప నూనె చర్మ మరియు జుట్టు సంబంధిత వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వేప నూనె మరియు వేప పిండి రైతులకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. వేపనూనె వినియోగించడం ద్వారా పైరును చీడపీడలు నుంచి కాపాడవచ్చు. దీంతో రసాయన మందుల వాడకం తగ్గుతుంది. ఇక సాగు ఖర్చులు కూడా కలిసొస్తాయి. మరి పొలంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం…
వేప చేదుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీనిలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉండటం కారణంగా మొక్కలు చేదు ఎక్కుతాయి. ఈ క్రమంలో మొక్కలను చీడపురుగులు ఆశించడానికి వీలుండదు. అదేవిధంగా వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. ఇక పంట ఏదైనా సరే.. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించడం ద్వారా పంటకు మేలు చేకూరుతుంది. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి కలుపుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం అవుతుందని చెప్తున్నారు నిపుణులు.పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో వేపనూనె దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల రైతుల పెట్టుబడిలో చాలా ఖర్చు కలిసి వస్తుంది. Neem Oil and Crop Protection
కాగా పండ్లతోటల్లో ఈ వేపనూనెను ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు వేలాడదీయాలి. ఇలా చేయడం ద్వారా వేపనూనె వేరు ద్వారా మొక్కకు చేరుతుంది. ఇక అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంట పదిలంగా ఉంటుంది. అయితే వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది. వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా లభ్యం కావడం లేదు. అయితే బయటి మార్కెట్‌లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది. Neem Oil Benefits