Paddy Bags Damaged In The Open In Odisha ఒడిశాలో అకాల వర్షాలతో భారీగా ధాన్యం తడిచిపోయింది. వందల బస్తాల ధాన్యం నీటి పాలయినట్లు రైతులు వాపోతున్నారు. డిసెంబర్ 28 న మొదలైన వడగళ్ల వానతో కూరగాయ పంటలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పంట నష్టం జరిగింది. బార్‌ఘర్ , సంబల్‌పూర్, జార్సుగూడ, సుందర్‌ఘర్, డియోగర్, అంగుల్, కియోంజర్ మరియు మయూర్‌భంజ్ వంటి ఇతర జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆరుగాలం పండించిన పంట నీటి పాలయింది.
ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లా రాష్ట్రంలో వరి సేకరణలో అగ్రస్థానంలో ఉంది. అయితే ఆ జిల్లాలో 193 మార్కెట్ యార్డుల్లో 73 శాశ్వత మరియు 120 తాత్కాలిక యార్డుల్లో దాదాపు 1.1 మిలియన్ బస్తాల వరి బస్తాలు బహిరంగంగా పడి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. సంబల్‌పూర్ జిల్లాలో మరో 40 వేల బస్తాలు అదే పరిస్థితిలో పడి ఉన్నాయి. ఒక బస్తా వరిలో దాదాపు 50 కిలోల వరి ఉంటుంది. వరి కనీస మద్దతు ధర కిలో రూ.19.40. అంతేకాకుండా బార్‌ఘర్‌లోని అంబభోనా, సోహెలా, భట్లీ మరియు బర్‌ఘర్ బ్లాక్‌లలోని ప్రాంతాలలో వడగళ్ళు మరియు వర్షం కారణంగా పొలంలో కూరగాయల పంటలు అపారంగా దెబ్బతిన్నాయని అధికారులు నివేదించారు. Odisha Farmers
ఇక దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లాలోని చాలా మార్కెట్ యార్డుల్లో తాత్కాలిక షెడ్లు ఉండగా, వాటిలో చాలా వరకు శాశ్వత షెడ్లు ఉన్నాయని బార్‌ఘర్ కలెక్టర్ మోనిషా బెనర్జీ తెలిపారు.షెడ్డు లేని బహిరంగ ప్రదేశంలో పడి ఉన్న వరి బస్తాలు టార్పాలిన్‌తో కప్పబడి ఉన్నాయని కలెక్టర్ మీడియాకు వివరించారు. మరోవైపు మార్కెట్ యార్డులో వరి, పొలాల్లోని కూరగాయల పంటలకు నష్టంపై అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్లు అదే పనిలో ఉన్నట్లు, వారు సమర్పించిన నివేదికల తర్వాత చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. paddy bags damaged In Odisha
అయితే బాధిత రైతులు మాత్రం మరోలా చెప్తున్నారు. చాలా మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యాన్ని కాపాడేందుకు షెడ్డు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి బస్తాలను కప్పి ఉంచిన టార్పాలిన్‌లు గాలులకు ఎగిరిపోయాయని, అదేవిధంగా మార్కెట్ యార్డుల్లో సిమెంట్ ఫ్లోరింగ్ లేనప్పుడు టార్పాలిన్‌లు ఎలా పని చేస్తాయి? ఈదురు గాలులకు టార్పాలిన్‌లు ఎగిరిపోవడంతో వర్షానికి వరి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయని అధికారులపై మండిపడుతున్నారు బాధిత రైతులు.
కాగా.. గతేడాది కూడా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆ ప్రాంత రైతులు. నానబెట్టిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైస్‌మిల్లు యజమానులు నిరాకరించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులు గుర్తు చేశారు. Odisha Rains Updates