పశుపోషణ

అగ్రి బిజినెస్ ఐడియాలు

0
Profitable Agriculture Business Ideas

Top Most Profitable Agriculture Business Ideas దేశాభివృద్ధిలో వ్యవసాయం అత్యంత కీలకం. వ్యవసాయమే కాకుండా దానికి అనుబంధ పనులు చేస్తూ లాభాలను గడించవచ్చు. దీనికి కేంద్రం ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుంది. అందులో భాగంగా ప్రధాని మోడీ వ్యాపారవేత్తల ప్రాముఖ్యతను అర్ధం చేసుకుని వారి ఆవిష్కరణలకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తున్నారు. అందుకే దేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించే స్టార్ట్ అప్ ఇండియా & మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో పాటు ప్రధాన మంత్రి ముద్ర యోజన వంటి అనేక కార్యక్రమాలు , పథకాలను ప్రారంభించారు.ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ పరిశ్రమలకు 10 లక్షల వరకు రుణాలు అందించడానికి ఏప్రిల్ 8, 2015న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను వాణిజ్య బ్యాంకులు, RRBలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, MFIలు మరియు NBFCలు అందిస్తాయి. మరి ప్రభుత్వ మద్దతుతో ఏ విధమైన వ్యవసాయం మరియు, దానికి అనుబంధ వ్యాపారాలు మొదలుపెట్టవచ్చో చూద్దాం Profitable Agriculture Business Ideas

30 Lakh Farmers Benefitted

ఎరువుల పంపిణీ వ్యాపారం:
పారిశ్రామికవేత్తలు ఎక్కడి నుండైనా ఎరువుల పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముందుగా మీరు విత్తనాలు, ఎరువులు, వర్మీ కంపోస్ట్ మొదలైనవాటిని విక్రయించడానికి లైసెన్స్ పొందవలసి ఉంటుంది.ఆపై మీ పరిసరాల్లో సరసమైన ధరకు వ్యాపారం చేయడానికి ఆసక్తి ఉన్న సరఫరాదారులను పెట్టుకోవాలి. సరసమైన ధరతో అధిక నాణ్యత ఉత్పత్తులను అమ్మాలి.

వ్యవసాయ సలహా సేవలు :
ఇతర కన్సల్టింగ్ సేవల మాదిరిగానే అగ్రికల్చర్ కన్సల్టింగ్ సేవలకు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. వ్యవసాయం యొక్క నిర్దిష్ట రంగంలో నైపుణ్యం మరియు అనుభవం ఉన్న వ్యక్తులు వ్యాపారాలు మరియు పంటకు సంబంధించిన కన్సల్టెన్సీ సేవలను మొదలు పెట్టవచ్చు.

Profitable Agriculture Business Ideas

పశుగ్రాసం ఉత్పత్తి :
ఇది చిన్న తరహా తయారీ ఆపరేషన్. మీకు పంపిణీ వ్యవస్థపై విశ్వాసం ఉంటే, పశువుల దాణా ఉత్పత్తి నుండి లాభం పొందడానికి మీరు ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు. కోళ్లు, గుర్రాలు, పందులు, పశువులు మరియు మేకలు వంటి పెంపుడు జంతువులను పోషించడం కోసం రైతులు ఏదైనా వ్యవసాయ వ్యర్ధాలను పశువులకు మేతగా ఉపయోగిస్తారు.

Profitable Agriculture Business Ideas

చేపల పెంపకం
వాణిజ్య చేపల పెంపకం అనేది సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని అందించే విలువైన పెట్టుబడి. ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ సొంత స్థలంలో చేపల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. Best Agriculture Business Ideas

Leave Your Comments

తెలంగాణ రాష్ట్రంలో పత్తికి రికార్డు స్థాయిలో ధర

Previous article

సీమపందుల పెంపకంతో మంచి ఆదాయం..!

Next article

You may also like