Cotton Price Hits Record High In Telangana తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల పంట పండుతుంది. ఒక్కసారిగా తెల్ల బంగారానికి ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో పత్తి ధర దూసుకెళుతుంది. కింటాకు రూ.9 వేలు పలకడం యార్డు చరిత్రలో ఇదే అత్యధికం అంటున్నారు రైతులు. గత నెల నవంబర్ నుంచి తగ్గుతూ వచ్చిన పత్తి ధరలు పది రోజులుగా క్రమంగా పెరుగుతుండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బుధవారం ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ లో కింటాకు రూ. 9,000 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇక వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పత్తి కింటాకు రూ.8,800 పలికింది. ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో ధర పలికినట్లు చెప్తున్నారు అధికారులు. Cotton Price In Telangana
పత్తి ధర అక్టోబరులో క్వింటా రూ.6 వేల నుంచి నెలరోజుల్లోనే కనీస మద్దతు ధరను మించి రూ.8 వేలకు చేరింది. నవంబరు మొదటి వారంలో రూ.9 వేలకు దగ్గరగా ధర పలకగా.. ప్రస్తుతం 9 వేలకు చేరింది. గత నెలలో నేలచూపులు చూసిన పత్తి ధరలు ఇప్పుడు పెరుగుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదివరకు ధరలు పతనం కావడంతో రైతులు పత్తిని విక్రయించడానికి వెనుకంజ వేశారు. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులుగా పత్తి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పత్తి పూత, కాయ దశలోనే పాడైపోయి దిగుబడి తగ్గింది. ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో పత్తికి భారీ డిమాండ్ వచ్చింది. Telangana White Gold