Major Edible Oil Brands ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ బాధ పడుతున్న సామాన్య ప్రజలకు పండగపూట శుభవార్త అందించాయి వంటనూనె చమురు సంస్థలు. వంట నూనెల రేట్లను 10–15 శాతం తగ్గించినట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. ఇటీవల వంటనూనె పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో మేజర్ ఎడిబుల్ ఆయిల్ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం ఫ్రీడం రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ. 140 లేదా అంతకంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. Edible Oil Brands
వంటనూనెల ధరలు తగ్గించిన బ్రాండెడ్ కంపెనీల వివరాలను చూస్తే ఫార్చ్యూన్ , రుచి సోయా, రుచి గోల్డ్, న్యూట్రేల్లా, మహాకోష్, ఇమామి, బంగే, ఫ్రీడమ్ ఆయిల్స్ ను ఉత్పత్తి చేసే అదాని విల్మార్, జెమిని, ఇమామి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవి మాత్రమే కాక న్యూట్రి లీవ్ బ్రాండ్స్, సన్నీ బ్రాండ్స్, గోకుల్ ఆగ్రో, జైకా బ్రాండ్స్, విటా లైఫ్, మెహక్ ధరలు కూడా ఎం ఆర్ పి పై 10 నుండి 15 శాతం వరకు తగ్గనున్నాయి.
ఇకపోతే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు తమ ఎంఆర్పీని తగ్గించేందుకు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. Cooking Oil Prices Reduced