Rythu Bandhu aid starts from today ఏడాది చివరి వారంలో రైతులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి అర్హులైన రైతులందరి ఖాతాలోకి రైతుబంధు సొమ్ము జమ కానుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్ధిక శాఖ ఇప్పటికే అవసరమైన మేర సొమ్ము కూర్పు చేసింది. రోజూ ఎకరా చొప్పున పెంచుకుంటూ ఆరోహణా క్రమంలో రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ సీజన్ రైతుబంధు సాయంతో 50 వేల కోట్లను దాటనుంది. ఇకపోతే ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు పొందిన వారు రైతుబంధు పథకానికి అర్హులని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ.43,036.63 కోట్లు జమ కాగా.. , ఈ సీజన్‌తో కలిపితే మొత్తం రూ.50 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటుంది. Rythu Bandhu
ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు 7645.66 కోట్లు జమ కానున్నాయి. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులుగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తయి ఆ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో యాసంగి పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రైతుబంధు విడుదల కావడం రైతులకు ఎంతో ఆసరాగా నిలవనుంది. Rythu Bandhu aid starts from today
తాజాగా రైతుబంధుపై మంత్రి నిరంజన్ రెడ్డి Niranjan Reddy మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో రైతుబంధు ఒకటి అని, 2018 నవంబరులో రోమ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో AFAO ప్రశంసించిందని వివరించారు మంత్రి నిరంజన్‌రెడ్డి. రైతుబంధు నిధుల జమ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. Telangana Farmers